ఇది ఒక గొప్ శాస్త్రీయ విజయం.... చంద్రయాన్ విజయంపై పాక్ విదేశాంగ ప్రతినిధి ప్రశంసలు....! చంద్రయాన్-3 విజయంపై ఎట్టకేలకు దాయాది పాక్ స్పందించింది. ఇది ఒక గొప్ప శాస్త్రీయ విజయంగా పాక్ విదేశాంగ శాఖ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జాహ్ర అన్నారు. ఈ విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించాల్సిందేనన్నారు. సంపన్న దేశాలతో పోలిస్తే అత్యంత తక్కువ ఖర్చుతో భారత్ ఈ విజయాన్ని సాధించిందని భారత్ పై ప్రశంసల జల్లు కురిపించారు. By G Ramu 26 Aug 2023 in ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి చంద్రయాన్-3 విజయంపై ఎట్టకేలకు దాయాది పాక్ స్పందించింది. ఇది ఒక గొప్ప శాస్త్రీయ విజయంగా పాక్ విదేశాంగ శాఖ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జాహ్ర అన్నారు. ఈ విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించాల్సిందేనన్నారు. సంపన్న దేశాలతో పోలిస్తే అత్యంత తక్కువ ఖర్చుతో భారత్ ఈ విజయాన్ని సాధించిందని భారత్ పై ప్రశంసల జల్లు కురిపించారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ భారత్ చేపట్టిన చంద్రయాన్ మిషన్ పై ప్రశంసలు కురిపించారు. బ్రిక్స్ లో చేర్చుకోవాలని తాము ఎలాంటి అభ్యర్థనలు చేయలేదని వెల్లడించారు. ప్రస్తుతం బ్రిక్స్ లో జరుగుతున్న పరిణామాలను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. బ్రిక్స్ తో కలిసి పని చేసే అంశంపై ఆలోచనలు చేస్తామని పేర్కొన్నారు. ఇస్రో సాధించిన విజయం గురించి పాక్ మీడియాలో కథనాలు ప్రచురించింది. ఆ దేశానికి చెందిన ప్రముఖ పత్రిక డాన్ ఇస్రోపై ప్రశంసల వర్షం కురిపించింది. సంపనన దేశాలతో పోలిస్తే అత్యంత తక్కువ ఖర్చుతోనే చంద్రునిపై భారత చంద్రయాన్ మిషన్ ల్యాండ్ అయిందని పేర్కొంది. భారత్, పాక దేశాల మధ్య పోలికలు సరికాదని వెల్లడించింది. కానీ భారత్ నుంచి పాక్ నేర్చుకోవాల్సిన అంశాలు చాలా వున్నాయని రాసుకొచ్చింది. అలాగే ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ అనే మరో వార్తాపత్రిక భారత్ ను ఆకాశానికి ఎత్తింది. చంద్రయాన్-3 పై ఇండియాస్ లూనార్ లారెల్' శీర్షికతో కథనం ప్రచురించింది. అగ్రరాజ్యం అమెరికా, రష్యా, చైనాలు కూడా చేపట్టలేని ఒక అత్యద్బుతమైన ప్రయోగాన్ని భారత్ చేసిందని కొనియాడింది. చంద్రుని దక్షిణ ద్రువంపై కాలు మోపిన ఏకైక దేశం భారత్ అంటూ ప్రశంసించింది. ఇక జియో న్యూస్ ఛానల్ లో యాంకర్లు చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. భారత్, పాక్ మధ్య చాలా తేడాలు వున్నాయని షో హోస్ట్‌లు హ్యూమా అమీర్ షా, అబ్దుల్లా సుల్తాన్ అన్నారు. పొరుగు దేశం భారత్ చందమామ వరకు వెళ్తే మనం మాత్రం ఇక్కడే ఉండిపోయామని చెప్పారు. ఇప్పటికైనా మన దారులన మనమే వేసుకోవాలంటూ కామెంట్స్ చేశారు. #india #isro #pakisthan #vikram-lander #chandrayan #dawn మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి