ICC World Cup: ఫైనల్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధం.. 6వేల మందికి పైగా భద్రతా సిబ్బంది..

ఈరోజు ఆస్ట్రేలియా-భారత్‌ జట్ల మధ్య వరల్డ్‌ కప్ ఫైనల్ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో గుజరాత్‌ పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దాదాపు 6వేలకు పైగా భద్రతా సిబ్బందిని మోహరించింది.

New Update
ICC World Cup: ఫైనల్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధం.. 6వేల మందికి పైగా భద్రతా సిబ్బంది..

ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న భారత్‌-ఆస్ట్రేలియా వరల్డ్‌ కప్‌ ఫైనల్ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తన్నారు. ఈ టోర్నీలో వరుసగా పది మ్యాచ్‌లు గెలిచిన భారత్‌ ఓవైపు, ఐదుసార్లు ప్రపంచ కప్‌ను దక్కించున్న ఆస్ట్రేలియా మరోవైపు. రెండు బలమైన జట్ల మధ్య ఈ పోటీ జరగనుండటంతో మరింత ఉత్కంఠ నెలకొంది. గుజరాజ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. లక్షా ముప్పై వేల అభిమానులు స్టేడియంకు రానున్నారు. అలాగే ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్‌ మార్లేస్, కేంద్ర హోం మంత్రి అమతి షా, అస్సాం, తమిళనాడు సీఎంలు, తదితరులు కూడా ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఈ మెగా ఫైనల్‌కు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌ పోలీస్‌ శాఖ భారీ భద్రత ఏర్పాట్లు చేసింది. స్టేడియం వద్ద, లోపల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 6 వేలకు పైగా సిబ్బందిని మోహరించారు.

Also Read: ఫైనల్‌ సమరానికి సిద్ధం.. మరీ అహ్మదాబాద్‌లో వాతావరణ పరిస్థితి ఎలా ఉందో తెలుసా.. ?

వీళ్లతో పాటు గుజరాత్‌ పోలీసులు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ (RAF), హోమ్‌గార్డులు, ఇతర ఇబ్బందిని కూడా భద్రత కోసం వినియోగిస్తున్నామని గుజరాత్‌ పోలీస్‌శాఖ తెలిపింది. స్టేడియం లోపల 3 వేల మందిని, మిగిలిన వారిని స్టేడియం బయట, నగరంలోని పలు ప్రాంతాల్లో మోహరించామని తెలిపారు. అలాగే 23 మంది ఐజీ, డీఐజీ, డిప్యూటీ పోలీసు కమిషనర్లు, 39 కమిషనర్లు, 92 మంది ఇన్‌స్పెక్టర్లు స్టేడియం భద్రతను పర్యవేక్షిస్తారని పేర్కొంది. చేతక్‌ కమాండోలతో సహా.. బాంబ్‌ స్క్వాడ్‌కు చెందిన 10 టీమ్‌లు స్టేడియం పరిసరాల్లో అందుబాటులో ఉంటారని వివరించింది. ఇదిలాఉండగా.. 1.30 లక్షల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు పొందిన ఈ స్డేడియంలో ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యయి. మధ్యాహ్నం 12.30కు స్టేడియంపైన 10 నిమిషాల పాటు సూర్యకిరణ్‌ విమానాలు విన్యాసాలు చేయబోతున్నాయి. మరోవైపు ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రీతమ్‌ నేతృత్వంలో 500 మందికి పైగా డ్యాన్సర్లు వివిధ సూపర్‌హిట్‌ పాటలకు డ్యాన్సులు చేయనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు