Israel-Hamas: ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. అల్లకల్లోలంగా మారిన గాజా.. ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య నెలకొన్న దాడులు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. హమాస్ ఉగ్ర నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ వరుసగా చేస్తున్న దాడులతో గాజా వణికిపోతోంది. ఇటీవల హమాస్ ఇజ్రాయెల్‌పై ఒక్కసారిగా దాదాపు 5 వేల రాకెట్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం గత వారం రోజుల నుంచి ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు జరుపుతోంది. By B Aravind 14 Oct 2023 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య నెలకొన్న దాడులు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. హమాస్ ఉగ్ర నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ వరుసగా చేస్తున్న దాడులతో గాజా వణికిపోతోంది. ఇటీవల హమాస్ ఇజ్రాయెల్‌పై ఒక్కసారిగా దాదాపు 5 వేల రాకెట్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన అనంతరం గత వారం రోజుల నుంచి ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు జరుపుతోంది. ఈ తరుణంలో గాజా ప్రాంతం అల్లకల్లోలంగా మారిపోయింది. పెద్ద పెద్ద భవనాలు ధ్వంసమవుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటిదాక 1300 లకు పైగా భవనాలు కూలిపోయినట్లు ఐక్యరాజ్యసమితి మానవతా సంస్థ OCHA (ఆఫీస్ ఆఫ్ కోఆర్డినేషన్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అఫైర్స్) తెలిపింది. అయితే ఇందుకు సంబంధించి అంతర్జాతీయ మీడియా పలు కథనాలను వెల్లడించాయి. Also read:హమాస్ సీనియర్ మెంబర్ ఖతం…మిలిటెంట్లు వెనక్కి తగ్గినట్టేనా? ఈ నేపథ్యంలో గాజాలోని ప్రజా పనుల మంత్రిత్వ శాఖ పలు కీలక విషయాలు వెల్లడించింది. నగరంలోని 1324 నివాస, నివాసేతర భవనాలు ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో కుప్పకూలినట్లు చెప్పింది. వీటిల్లో దాదాపు 5,540 హౌసింగ్ యూనిట్లు నామ రూపాల్లేకుండా పోయినట్లు పేర్కొంది. అలాగే మరో 3,743 నివాసాలు మరమ్మతులు చేయలేని విధంగా దెబ్బతిన్నాయని.. ఇకనుంచి అవి నివాసయోగ్యంగా ఉండవని తెలిపింది.అలాగే మరో 55 వేల నివాసాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు OCHA తెలిపింది. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ వైమానిక దాడుల వల్ల గాజాలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఇప్పటిదాకా 2,215 మంది పాలస్తీనీయులు మరణించినట్లు హమాస్ నియంత్రణలో ఉన్న ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే వీళ్లలో 724 మంది చిన్నారులు కూడా ఉన్నారని తెలిపింది. మరో 8,714 మంది గాయపడినట్లు చెప్పింది. గడిచిన 24 గంటల్లోనే గాజాలో 126 మంది చిన్నారులతో పాటు 324 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు గాజాలో గ్రౌండ్ ఆపరేషన్‌కు రెడీ అవుతున్న ఇజ్రాయెల్ సైన్యం.. ఉత్తర గాజాలోని పాలస్తీనీయులు తక్షణమే ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రాణభయంతో అక్కడ ఉంటున్న స్థానికులు వలసబాట పట్టారు. #israel-attack #hamas-vs-israel #hamas-israel-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి