World Cup 2023: మా మొదటి లక్ష్యం పూర్తయింది-రోహిత్ మా తొలి లక్ష్యం పూర్తయింది అంటున్నాడు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. మా నెక్ట్స్ టార్గెట్ ఫైనల్స్ అని చెబుతున్నాడు. దీని కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతామని అంటున్నాడు. వరల్డ్ కప్ మొదటి నుంచి టీమ్ ప్లేయర్స్ అందరూ అద్భుతంగా ఆడుతున్నారంటూ పొగడ్తల్లో ముంచెత్తేస్తున్నాడు కెప్టెన్ రోహిత్. By Manogna alamuru 03 Nov 2023 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి World Cup 2023: వరల్డ్‌కప్‌లో నిన్న శ్రీలంక మీద మ్యాచ్ గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టింది భారత్. ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే ఈ టార్గెట్‌ను చేరుకుంది. అసలు ప్రపంచకప్ లో మొదట నుంచి టీమ్ ఇండియా (Team India) ఆదరగొడుతోంది. ప్రతీ ఆటగాడు తమ మీద ఉన్న అంచనాలను నిజం చేస్తున్నారు. బ్యాటర్లు, బౌలర్లు ఫుల్ ఫామ్‌లో ఉండి చెలరేగిపోతున్నారు. నిన్న మ్యాచ్‌లో అయితే పూర్తిగా ఆధిక్యాన్ని ప్రదర్శించేశారు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లలో ఏ టీమ్ అంత తక్కువ స్కోరుకు అవుట్ అవ్వలేదు. శ్రీలంక (Srilanka) ఆటగాళ్ళు పూర్తి విఫలం అయ్యారు. దానికి తోడు టీమ్ ఇండియా బౌలర్లు కూడా రెచ్చిపోయారు. అంతకు ముందు బ్యాటర్లు అందరూ కన్సిస్టెన్సీని మెయింటెయిన్ చేస్తూ అద్భుతంగా రాణించారు. Also Read:అన్నారం బ్యారేజిలో రెండుచోట్ల బుంగలు..కాళేశ్వరానికి అసలేమైంది ఇక కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ అవుతున్నాడు రోహిత్ శర్మ (Rohit Sharma). మంచి ఆలోచనతో కెప్టెన్సీ చేస్తూ టీమ్ ఇండియాను విజయతీరాలకు చేరుస్తున్నాడు. వరల్డ్ కప్ మొదట నుంచి తమ ఆట తీరు పట్ల గర్వంగా ఉంది అంటున్నాడు రోహిత్. ఇప్పుడు సెమీస్‌కు చేరుకున్నందుకు కూడా ఆనందంగా ఉందని చెబుతున్నాడు. దీంతో మా మొదటి లక్ష్యం పూర్తయిందని...నెక్స్ట్ టార్గెట్ ఫైనల్స్ అని తెలిపాడు. ఇప్పటివరకు జరిగిన ఏడు మ్యాచ్‌లలో టీమ్ ఆడిన విధానం పట్ల చాలా సంతృప్తిగా ఉన్నా అంటున్నాడు కెప్టెన్. బ్యాటర్లు సమయానికి తగ్గట్టు రాణిస్తున్నారు. నిన్నటి మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ ఆడిన తీరు అద్భుతం అని పొగిడేస్తున్నాడు. అలాగే సూర్యకుమార్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడని అన్నాడు. మరోవైపు బౌలర్ల గురించి అయితే చెప్పక్కర్లేదు. వాళ్ళ గురించి ఎతం చెప్పినా తక్కువే. సిరాజ్ (Siraj) అయితే కొత్త బంతితో అద్భుతాలు చేస్తున్నాడు అంటూ టీమ్ ఇండియా బౌలర్లను పొగడ్తల్లో ముంచెత్తేశాడు రోహిత్. ఇదే ఊపును చివర వరకు కొనసాగిస్తారని ఆశిస్తున్నానన్నాడు. డీఆర్ఎస్ రివ్యూలను బౌలర్, వికెట్ కీపర్‌లకే వదిలేసా.వారికి అప్పీల్ చేయాలని బలంగా అనిపిస్తే చేయమని చెబుతున్నా అంటున్నాడు. ఎందుకంటే బంతి గురించి వారిద్దరికంటే ఎవరికీ బాగా తెలియదని చెబుతున్నాడు. Also Read:జేఈఈ మెయిన్ దరఖాస్తులు ప్రారంభం.. ఇదిగో పూర్తి వివరాలు నెక్ట్స్ మ్యాచ్ భారత్ సౌత్ ఆఫ్రికాతో ఆడుతోంది. ఈ మ్యాచ్ గెలిచినా, ఓడినా భారత్ కు వచ్చే నష్టమేమీ లేదు. కానీ టీమ్ ఇండియా మాత్రం అలా అనుకోవడం లేదు. ప్రతీ మ్యాచ్ గెలిచి తమ విజయపరంపరను కొనసాగించాలనుకుంటోంది అని చెబుతున్నాడు రోహిత్ శర్మ. సఫారీలు చాలా బాగా ఆడుతున్నారని... ఇద్దరికీ టఫ్ ఫైట్ జరగొచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ క్రికెట్ లవర్స్ కు మంచి విందును అందిస్తుందని అంటున్నాడు. #rohit-sharma #cricket #icc-world-cup-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి