Amartya Sen: విపక్ష పార్టీలు ఎందుకు బలహీనంగా ఉన్నాయో చెప్పిన అమర్త్య సేన్ ఐక్యమత్యం లేకపోవడం వల్లే.. భారత్‌లో విపక్షాలు బలహీనపడ్డాయని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహిత అమర్త్య సేన్ అన్నారు. విపక్ష పార్టీలన్ని ఐక్యంగా ఉంటే బీజేపీని ఓడించేందుకు కావాల్సిన బలం లభించి ఉండేదని అభిప్రాయపడ్డారు. By B Aravind 14 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార, విపక్ష పార్టీలు రంగంలోకి దిగాయి. ఓవైపు మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ, మరోవైపు మోదీ సర్కార్‌ను గద్దె దింపాలని విపక్ష కూటమి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే విపక్ష పార్టీలు బలహీనంగా ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహిత అమర్త్య సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యమత్యం లేకపోవడం వల్లే.. భారత్‌లో విపక్షాలు బలహీనపడ్డాయని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌కు అనేక సంస్థాగత సమస్యలు ఉన్నాయని.. వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని తాజాగా పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. Also Read: బీజేపీ మేనిఫెస్టోపై మల్లిఖార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు.. దేశంలో కులగణనను పరిగణలోకి తీసుకోవాల్సిన అంశమేనని.. కానీ దానికంటే ముందు మెరుగైన విద్య, ఆరోగ్య సంరక్షణ, లింగ సమానత్వం లాంటి అంశాల్లో వెనకబడిన ప్రజలకు మరింత సాధికారత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశ పౌరడినైనందుకు గర్విస్తున్నానని.. కానీ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇంకా కృషి జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆర్‌ఎల్‌డీ, జేడీయూ వంటి పార్టీలు ఇండియా కూటమి నుంచి వెళ్లిపోవడంతో ఈ కూటమి ఆదరణ కోల్పోయిందని అన్నారు. విపక్ష పార్టీలన్ని ఐక్యంగా ఉంటే బీజేపీని ఓడించేందుకు కావాల్సిన బలం లభించి ఉండేదని తెలిపారు. సమస్యలతో ఉన్న కాంగ్రెస్.. తమ గతం నుంచి స్పూర్తి పొందాలని సూచించారు. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఆర్థిక విధానాలపై కూడా అమర్త్య సేన్ విమర్శించారు. భారత్ అభివృద్ధికి నిరక్షరాస్యత, లింగ అసమానత్వం అడ్డంకులుగా మారినట్లు పేర్కొన్నారు. అధికార పార్టీ పూర్తిగా ధనవంతుల పక్షాన ఉంటోందని ఆరోపణలు చేశారు. వాళ్లు రాజ్యాంగంలో చేసే మార్పుల వల్ల సామాన్య ప్రజలకు ఒరిగేది ఏమి ఉండదన్నారు. Also read: మహిళలు, యువతే లక్ష్యంగా బీజేపీ సంకల్ప పత్ర #telugu-news #national-news #2024-lok-sabha-elections #amartya-sen మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి