Life Style:పాత జ్ఞాపకాలను కళ్ళ ముందుంచే క్రియేటివ్ ద్వారాలు

పాత రోజుల్లో రంగు రంగులతో ఎక్కడ చూసినా అందమైన ద్వారాలు కనిపించేవి. ముఖ్యంగా పల్లెల్లో. ఈరోజుకీ మదిలో పదిలంగా ఉన్న ఆ తలుపులనే ‘లైఫ్‌సైజు’ చిత్రాలుగా మలుస్తున్నాడు యువ కళాకారుడు కేఆర్‌ సంతానకృష్ణన్‌. మళ్లీ మనల్ని ఆ నాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళుతున్నాడు.

New Update
Life Style:పాత జ్ఞాపకాలను కళ్ళ ముందుంచే క్రియేటివ్ ద్వారాలు

తమిళనాడులోని కుంభకోణం... వారసత్వ సంపదకు పెట్టింది పేరు. సంతానకృష్ణన్‌దీ అదే ప్రాంతం. చదివే రోజుల్లో అక్కడి వీధుల్లో నుంచి వెళుతుండేవాడు. ఇళ్ళ గుమ్మాలు, తలుపులు రంగు రంగుల్లో... కళ్ళలకు ఇంపుగా... ఎంతో కళగా కనిపించేవి. అవి అతడిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. డిగ్రీ అయిపోయింది. చెన్నైలో మాస్టర్స్‌ చేయడానికి వెళ్ళేముందు ప్రయోగాత్మకంగా తలుపుల పెయింటింగ్స్‌ గీయాలనుకున్నాడు కృష్ణన్‌. కుంభకోణంలో అతడు చూసిన చిత్రాన్ని ఉన్నది ఉన్నట్టు మినియేచర్లుగా మలిచాడు. అక్రాలిక్‌ పెయింటింగ్స్‌తో తుదిరూపు ఇచ్చాడు.

Also Read:తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి.. 7న ప్రమాణస్వీకారం

గొప్ప కళాకారుల్లా ఈ రంగంలో నాకంటూ ఓ ప్రత్యేకత ఉండాలనుకున్నా. దానికి థీమ్‌ ఏమిటని ఆలోచిస్తుండగా ఆ తలుపులు గుర్తుకువచ్చాయి. ఇక ఆలస్యం చేయలేదు అంటాడు కృష్ణన్‌. దాన్నే వృత్తిగా తీసుకున్న అతను కొన్నేళ్ళకు అందులో నిష్ణాతుడయ్యాడు. ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. తను మలిచిన ద్వారాలతో బోలెడు ప్రదర్శనలు ఇచ్చాడు. అనుకున్నట్టుగానే ముఖద్వారాలకు ముఖచిత్రమయ్యాడు.

ఎక్కడకు వెళ్లినా... సంతానకృష్ణన్‌ కళాచిత్రాలకు విపరీతమైన ఆదరణ వచ్చింది. ఎవరు చూసినా ఫిదా కావల్సిందే. అంతలా ప్రతిఒక్కరినీ ఆకట్టుకున్నాడు అతడు. దానికి కారణం ఏమిటని కృష్ణన్‌ను అడిగితే... ‘‘ఈ తలుపులు చూసిన ప్రతిఒక్కరూ నాతో చెప్పే మొదటి మాట... బాల్యంలో తమ ఇల్లు గుర్తుకు వచ్చిందని..! అలా నాటి జ్ఞాపకాలు ఒక్కసారి వారి కళ్ళ ముందు తిరుగుతున్నాయని. అలా తమ మూలాలను జ్ఞప్తికి తెచ్చుకొంటూ... మధురానుభూతి పొందుతున్నారు. బహుశా అందుకే నా చిత్రాలు అంతగా క్లిక్‌ అవుతున్నాయోమో అంటాడు.

కృష్ణన్ వేసిన పెయింటింగ్స్‌లో ఎన్టీఆర్‌, కమల్‌హాసన్‌, అమితాబ్‌బచ్చన్‌, కరణ్‌జోహార్‌, సచిన్‌ టెండుల్కర్‌...ఇంకా చాలా మంది సెలబ్రిటీల ద్వారాలు కూడా ఉన్నాయి. బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌, చెన్నైలోని రెయిన్‌ట్రీ హోటల్స్‌కు వెళితే కృష్ణన్‌ కళకు అద్దంపట్టే తలుపులు ఆహ్వానం పలుకుతాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Mangoes: మధుమేహం ఉంటే మామిడి పండ్లు తినవచ్చా?

డయాబెటిస్ ఉన్న కొందరు మామిడి పండ్లు తినడానికి భయపడుతారు. తీపి పండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని నమ్ముతారు. మామిడి పండ్లలో మాంగిఫెరిన్ అనే చురుకైన సమ్మేళనం, మామిడి పిపి రక్తంలో చక్కెరను, చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

New Update

Mangoes: వేసవి ఎండలు ప్రతి చోటా మండుతున్నాయి. మామిడి సీజన్ కూడా ప్రారంభమైంది. ఈ పండు రాక కోసం మామిడి ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొన్ని రోజుల్లో అనేక రకాల మామిడి పండ్లు మార్కెట్లో లభిస్తాయి. మామిడి పండ్లను పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. దీనివల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మామిడి పండ్లు తినాలనిపిస్తుంది. డయాబెటిస్ ఉన్న కొందరు మామిడి పండ్లు తినడానికి భయపడుతారు. తీపి పండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని నమ్ముతారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లు తినవచ్చా లేదా ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. 

క్యాన్సర్, గుండె సమస్యలు పరార్:

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మామిడి అనేక పోషకాలకు నిలయం. మామిడిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, అమైనో ఆమ్లాలు, లిపిడ్లు, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. కొలెస్ట్రాల్ ఉండదు. మామిడిలో కాల్షియం, భాస్వరం, ఐరన్‌, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ కె వంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. 100 గ్రాముల మామిడి తినడం వల్ల శరీరానికి 60 నుండి 90 కేలరీలు లభిస్తాయి. మామిడిలో 75 నుండి 85 శాతం నీరు ఉంటుంది. మామిడి పండ్లలో మాంగిఫెరిన్ అనే చురుకైన సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. మామిడి పిపి చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.  .  

ఇది కూడా చదవండి: కూల్‌ డ్రింక్స్‌ కాదు రాగి అంబలి తాగండి.. సింపుల్‌గా ఇలా చేసుకోండి!

మామిడిని సరైన పరిమాణంలో తింటే అందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లను పరిమిత పరిమాణంలో తినాలి. మామిడి గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆమోదయోగ్యమైన స్థాయిలో ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు 50 కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. మామిడి పండ్ల GI దాదాపు 51 ఉంటుంది. కాబట్టి మధుమేహ రోగులు కూడా మామిడి పండ్లను తినవచ్చు. మామిడి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరగవని పోషకాహార నిపుణులు అంటున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి ఆహారం, కేలరీలను దృష్టిలో ఉంచుకుని మామిడి పండ్లు తినాలి.  

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: బట్ట తలతో బాధపడేవారికి శుభవార్త చెప్పిన శాస్త్రవేత్తలు



( mangoes-tips | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment