వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా రూ. 15 వేలు తగ్గింపు!

New Update
వన్‌ప్లస్  స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా రూ. 15 వేలు తగ్గింపు!

వివిధ సంస్థలు స్పెషల్ సేల్స్ నిర్వహిస్తూ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్, ఇతర గాడ్జెట్స్‌పై మంచి డిస్కౌంట్లు అందిస్తున్నాయి. తాజాగా వన్‌ప్లస్ కంపెనీ, ‘వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ 2024’ (OnePlus Community Sale) అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్లలో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు, ఇతర ప్రొడక్ట్స్‌ను అతి తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. జూన్ 14 వరకు అన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్‌లో ఈ డీల్స్ అందుబాటులో ఉంటాయి. ఆఫర్ల వివరాలు చెక్ చేద్దాం.

వన్‌ప్లస్ ఓపెన్ కంపెనీ నుంచి వచ్చిన ఫోల్డబుల్ ఫోన్. కస్టమర్లు కమ్యూనిటీ సేల్‌లో ఈ ఫ్లాగ్‌షిప్ డివైజ్‌ను ఏకంగా రూ.10,000 డిస్కౌంట్, రూ. 5,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవచ్చు. అంటే తాజా సేల్‌లో వన్‌ప్లస్ ఓపెన్ కేవలం రూ.1,34,999కి లభిస్తుంది. అలాగే కస్టమర్లు దీని కొనుగోలుపై వన్‌ప్లస్ వాచ్ 2ను ఉచితంగా పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా ఉంది.

వన్‌ప్లస్ 12 తాజా సేల్‌లో వన్‌ప్లస్ 12 గ్లేషియల్ వైట్ ఎడిషన్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర భారీగా తగ్గింది. ఈ ఫోన్ ధర రూ.64999. అయితే దీనిపై రూ.3,000 డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే రూ.2,000 కూపన్ డిస్కౌంట్ కూడా ఉంది. ఈ ఫోన్ కొనేవారికి వన్‌ప్లస్ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందిస్తోంది. రూ.12వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా అందుబాటులో ఉంది.

వన్‌ప్లస్ 12R ఈ ఫోన్ అసలు ధర రూ.39,999. అయితే వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్‌లో దీనిపై మంచి డిస్కౌంట్ ఉంది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 2000 బ్యాంక్ డిస్కౌంట్, రూ. 2000 కూపన్ డిస్కౌంట్ ప్రకటించింది. నెలకు రూ. 3,000 నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్, రూ.6,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉన్నాయి.

వన్‌ప్లస్ నార్డ్ CE4 ఈ మిడ్‌రేంజ్ ఫోన్‌ తాజా ఆఫర్లలో రూ. 22,999కి లభిస్తుంది. వన్‌ప్లస్ ఈ డివైజ్‌పై రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. రెడ్ కేబుల్ క్లబ్ మెంబర్స్ రూ. 500 బెనిఫిట్స్ పొందవచ్చు. స్టూడెంట్స్ వన్‌ప్లస్ నార్డ్ CE4 ఫోన్‌ కొంటే రూ.500 ఎడిషనల్ డిస్కౌంట్ లభిస్తుంది. కస్టమర్లకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ కూడా ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పండగ పూట మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ వల్ల బంగారం ధరలు తగ్గాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.83,100గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.90,660 వద్ద ఉంది. ప్రాంతం, సమయాన్ని బట్టి వీటి ధరల్లో మార్పులుంటాయి.

New Update
gold

gold

ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ వల్ల బంగారం ధరలు తగ్గాయి. నిన్న  10 గ్రాముల బంగారం దగ్గర రూ. 900 నుంచి రూ. 980 వరకు తగ్గింది. అయితే నేడు వీటి కంటే ఒక రూ.10 తగ్గింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.83,100గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.90,660 వద్ద ఉంది. ప్రాంతం, సమయాన్ని బట్టి వీటి ధరల్లో మార్పులుంటాయి.

ఇది కూడా చూడండి: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

24 క్యారెట్ల బంగారం ధర

హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.90,660
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.90,660
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.90,640
ముంబైలో 10 గ్రాముల ధర రూ.90,660
కోల్‌కతాలో 10 గ్రాముల ధర రూ.90,650
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.రూ.90,660
బెంగళూరులో 10 గ్రాముల  రూ.90,610
పుణెలో 10 గ్రాముల ధర రూ.90,600
అహ్మదాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.90,600
విశాఖపట్నంలో 10 గ్రాముల ధర రూ.90,590

ఇది కూడా చూడండి: WhatsApp new features: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

22 క్యారెట్ల బంగారం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల ధర  రూ.83,100
విజయవాడలో 10 గ్రాముల ధర రూ.83,200
ఢిల్లీలో10 గ్రాముల ధర రూ.83,300
ముంబైలో 10 గ్రాముల ధర రూ.83,110
కోల్‌కతాలో 10 గ్రాముల రూ.83,110
చెన్నైలో 10 గ్రాముల ధర రూ.83,140
పుణెలో 10 గ్రాముల ధర రూ.83,110
బెంగళూరులో 10 గ్రాముల ధర రూ.83,150
అహ్మదాబాద్‌లో 10 గ్రాముల ధర రూ.83,100
విశాఖపట్నంలో 10 గ్రాముల ధర రూ.83,100

ఇది కూడా చూడండి: USA: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

ఇది కూడా చూడండి: Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు