PM Modi : ప్రజల నుంచి తీసుకున్న ప్రతి రూపాయి కక్కిస్తాం : ప్రధాని మోదీ ఒడిశాలోని ఓ మద్యం వ్యాపారి ఇళ్లపై గత మూడు రోజులుగా సోదాలు చేస్తున్న ఐటీశాఖ శుక్రవారం నాటికి రూ.220 కోట్లను స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.. ప్రజల వద్ద నుంచి తీసుకున్న ప్రతి పైసాను కక్కిస్తామని ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు. By B Aravind 08 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Return Every Rupee Taken from People PM Modi : పన్ను ఎగవేత ఆరోపణలపై ఒడిశాలోని ఓ మద్యం వ్యాపారి ఇళ్లపై ఐటీ శాఖ గత మూడు రోజులుగా సోదాలు జరుపుతోంది. అయితే ఈ తనిఖీల్లో భాగంగా శుక్రవారం వరకూ రూ.220 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ ఘటనపై ప్రధాని మోదీ(PM Modi) స్పందించారు. ప్రజల వద్ద నుంచి తీసుకున్న ప్రతి పైసాను కక్కిస్తామని పేర్కొన్నారు. మద్యం వ్యాపారి ఇళ్లలో సోదాలు చేసిన అధికారులు 156 బ్యాగుల నిండా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. తాజాగా స్వాధీనం చేసుకున్న బ్యాగుల్లో ఆరేడు బ్యాగులు మాత్రమే లెక్కించామని.. ఇందులో రూ.20 కోట్ల నగదు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో మొత్తం ఇప్పటివరకు రూ.220 కోట్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. సంబల్‌పుర్, బోలన్‌గిరి, భువనేశ్వర్ సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. Also Read: మహువా బహిష్కరణ వేటుపై దీదీ ఆగ్రహం.. ఏమన్నారంటే అయితే సోదాలు జరగడంపై ఆ కంపెనీ ఇప్పటివరకు స్పందించలేదు. మరోవైపు ఝార్ఖండ్‌కు చెందిన ఎంపీకి కూడా లిక్కర్ కంపెనీతో సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై స్పందించిన ప్రధాని మోదీ.. నోట్ల కట్టలు బయటపడ్డ వార్తలకు సంబంధించిన క్లిప్పింగ్‌ను తన ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును వెనక్కి రప్పిస్తామంటూ హామీ ఇచ్చారు. ఇదిలాఉండగా.. ఒడిశా ప్రభుత్వం బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక నేతలు, రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఈ స్థాయిలో పన్ను ఎగవేయడం అసాధ్యమంటూ విరుచుకుపడింది. అయితే ఈ ఆరోపణలను బిజూ జనతాదళ్ ఖండించింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. నోట్ల కట్టలు బయటపడ్డ వార్తకు సంబంధించిన క్లిప్పింగును తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ నోట్ల గుట్టలు చూసి నాయకులు చెప్పే నీతి వాక్యాలు వినాలని వ్యంగ్యంగా అన్నారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును ప్రతి రూపాయినీ వెనక్కి రప్పిస్తామంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా విరుచుకుపడింది. స్థానిక నేతలు, రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఈ స్థాయిలో పన్ను ఎగవేయడం అసాధ్యమని భాజపా అధికార ప్రతినిధి మనోజ్ మహా పాత్రో విమర్శించారు. ఈ ఆరోపణలను బిజూ జనతాదళ్ ఖండించింది. #telugu-news #pm-modi #rtv-live మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి