Watch Video: బీభత్సం సృష్టించిన ట్రక్కు.. వేగంగా వచ్చి వాహనాలపైకి దూసుకెళ్లింది.. మహారాష్ట్రంలోని పూణేలో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ఆ ట్రక్క అదుపుతప్పి పలు వాహనాల పైకి దూసుకెళ్లి దూసుకెళ్లింది. ఈ ఘటనలో దాదాపు 7గురు గాయాలపాలయ్యారు. సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. By B Aravind 21 Nov 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి మహారాష్ట్రలోని పూణేలో ఓ ట్రక్కు అదుపుతప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. రోడ్డుపై ఆ ట్రక్కు వేగంగా దూసుకొచ్చింది. ఈ క్రమంలోనే అదుపుతప్పి ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత అలాగే వేగంగా ముందుకు వచ్చి వాహనాల పైకి దూసుకెళ్లింది. అయితే ఈ దుర్ఘటనలో సుమారు ఏడు మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. ప్రస్తుతం క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పూణేలోని పిరంగంట్ అనే ప్రాంతంలో శనివారం రోజున మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఒక కారు, ఐదు బైకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను వెతికే పనిలో పడ్డారు. ఇక చివరికి అతను ఉత్తరప్రదేశ్‌కు చెందిన 27 ఏళ్ల గోవింద్ లాల్ అనే వ్యక్తిగా గుర్తించారు. #Pune | In an unfortunate incident in the Pirangut area, a speeding cargo truck collided with five to six vehicles, resulting in injuries to seven people, including the tempo driver.#Accident #Maharashtra pic.twitter.com/b1EmzYfpS3 — Free Press Journal (@fpjindia) November 21, 2023 Also Read: ఆఖరి పోరాటం.. ఇక మిగిలింది వారం రోజులే! ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇదిలాఉండగా.. ఈ మధ్య రోడ్డుపై కొంతమంది వ్యక్తులు నిర్లక్ష్యంతో ఇష్టం వచ్చినట్లు, వేగంగా వాహనాలు నడుపుతున్నారు. ఇలాంటి వారి వల్ల ఇతరులు ప్రాణపాయ స్థితిలోకి వెళ్తు్నారు. రాంగ్ రూట్‌లో రోడ్డుపై వెళ్లడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, అతివేగంగా వాహనం నడపడం లాంటి ఘటనలు ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. Also Read: కాంగ్రెస్ నేతలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన కేటీఆర్.. #telugu-news #accident #viral-video మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి