Hanu-Man Movie : ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు.. హనుమాన్ హిట్ - ఆదిపురుష్ మీద ట్రోలింగ్ తేజ సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా బంపర్ హిట్ కొట్టింది. అద్భుతంగా ఉంది...వీఎఫ్ఎక్స్ అదిరిపోయాయని అంటున్నారు. అయితే ఇప్పుడు హనుమాన్ సినిమా గ్రఫిక్స్ ఓం రౌత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. రౌతు బాబూ డబ్బులు పెట్టేయడం కాదు...ముందు సినిమా ఎలా తీయాలో నేర్చుకో అంటున్నారు జనాలు. By Manogna alamuru 12 Jan 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Adipurush Trolling : ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు రావడం అంటే ఇదే. హనుమాన్(Hanu-Man) సినిమా హిట్ అవడం ఏమో కానీ మధ్యలో ఆదిపురుష్(Adipurush) సినిమా మీద విపరీతంగా ట్రోలింగ్ అవుతోంది. ఆ మూవీ డైరెక్టర్ ఓం రౌతును అయితే జనాలు ఓ లెవల్లో ఆడేసుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే...హనుమాన్ సినిమా నిన్న విడుదల అయింది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ అద్భుతంగా ఉందని టాక్ వచ్చింది. గ్రాఫిక్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే కేవలం 25 కోట్లలో మూవీని చాలా గొప్పగా తీశాడని చెప్పుకుంటున్నారు. పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ప్రశాంత్ వర్మ(Prashanth Varma) ను చూసి నేర్చుకోవాలని చెబుతున్నారు. రాజమౌళి లాంటి వారిని కూడా వదలడం లేదు. అంత తక్కువ బడ్జెట్‌లో హాలీవుడ్ లెవల్ గ్రాఫిక్స్ తీశాడంటే భయ్యా...మాటల్లేవ్ అని చెబుతున్నారు. Also read:కొత్త ఆవకాయలా ఇంటిల్లిపాదీ మెచ్చే సూపర్ హీరో హను-మాన్! #Hanuman - #OmRaut will receive more criticism in the days to come than what he received after #Adipurush#PrasanthVarma will receive more offers and calls from producers spanning from North to South pic.twitter.com/dJybkZtXBH — Telugu Box office (@TCinemaFun) January 12, 2024 ఇప్పుడు ఈ టాకే ఆదిపురుష్ టీమ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఆదిపురుష్ మూవీకి ఓం రౌతు(Om Raut) వందకోట్లు ఖర్చుపెట్టాడు. పోనీ సినిమా ఏమైనా బావుందా అంటే...పరమ దరిద్రంగా ఉంది. చిన్న పిల్లలు కూడా ఆ గ్రాఫిక్స్ చూసి పడీపడీ నవ్వుకున్నారు. కానీ హనుమాన్ సినిమాకు 25 కోట్లే ఖర్చు పెట్టారు. వీఎఫ్ఎక్స్ పీక్స్‌లో ఉన్నాయి. అందుకే అందరూ ఓం రౌతుకు సలహాలు ఇస్తున్నారు. భయ్యా సినిమా ఎలా తీయాలో ప్రశాంత్ వర్మను చూసి నేర్చుకో అంటూ క్లాసులు పీకుతున్నారు. #HanuManRAMpage #HanuManEverywhere #Omraut #PrashanthVarma pic.twitter.com/FTp6E5veuW — Sri Sai Kolusu (@singlekingulam) January 12, 2024 హనుమాన్ సినిమాకు పెట్టింది ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లు. కానీ వచ్చింది మాత్రం వంద కోట్లకు పైగా ఉంటుంది. ఇంత తక్కువ బడ్జెట్ అంత క్వాలిటీని ఎలా రాబట్టుకున్నాడో ప్రశాంత్ వర్మ నుంచి అంతా నేర్చుకోవాలని అంటున్నారు. ఇది టాలీవుడ్(Tollywood), బాలీవుడ్(Bollywood) మేకర్లు తెలుసుకోవాల్సిన విషయం అని, ఇదొక గైడెన్స్‌లా నిలిచిపోతుందని, అంతా ప్రశాంత్ వర్మ వద్ద నేర్చుకోవాల్సిన విషయమని నెటిజన్లు అంటున్నారు. Ee roju nundi start ayye trolls ki OM RAUT be Like: #HanuManRAMpage #HanumanOnJan12th #Omraut @PrasanthVarma @tejasajja123 pic.twitter.com/CMxiahnH4S — Madarauchiha (@Madarauchiha518) January 12, 2024 #prashanth-varma #trolling #hanu-man #adipurush #om-raut మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి