Office Space: హైదరాబాద్ సహా ఆరు నగరాల్లో ఆఫీస్ స్పేస్‌కు భారీ డిమాండ్! హైదరాబాద్ తో బాటు దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ కోసం ఈ ఏడాది భారీ డిమాండ్ ఉండవచ్చని అంచనాలు వేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి క్రమేపీ కంపెనీలు నో చెబుతున్న పరిస్థితుల్లో ఆఫీస్ స్పేస్ కోసం డిమాండ్ పెరిగే అవకాశాలు పెరిగాయని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. By KVD Varma 10 Mar 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Office Space: భారతదేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్‌కు ఈ ఏడాది డిమాండ్ బాగానే ఉంటుందని తాజా రిపోర్టులు చెబుతున్నాయి. FICCI-Colliers రిపోర్ట్ ప్రకారం, దేశీయ, విదేశీ కంపెనీలు తమ వ్యాపార విస్తరణ కోసం 2024లో 5-55 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణాన్ని లీజుకు తీసుకోవచ్చు. ఆరు ప్రధాన నగరాల్లో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, హైదరాబాద్, ముంబై, పూణేలలో 5.82 కోట్ల చదరపు అడుగుల ఆఫీసు స్థలం(Office Space) మొత్తం లీజుకు తీసుకునే అవకాశం ఉంది. ఇండస్ట్రీ బాడీ FICCI అలాగే, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా ఈ వారం ప్రారంభంలో తమ నివేదికను విడుదల చేశాయి. ఈ రిపోర్ట్ ఆఫీస్ స్పేస్(Office Space) కోసం డిమాండ్ అవకాశం ఉన్న మూడు రకాల పరిస్థితులను వివరిస్తుంది. వాస్తవికంగా ఉండే అవకాశాలు, ఆశావాద అంచనాలు, తక్కువలో తక్కువగా ఉండవచ్చనే అంచనాలతో పరిస్థితిని రిపోర్ట్ వెల్లడించింది. 5 కోట్ల చదరపు అడుగుల కంటే ఎక్కువ డిమాండ్ అంచనా.. నివేదిక ప్రకారం, వాస్తవిక పరిస్థితుల్లో, ఈ సంవత్సరం ఈ ఆరు నగరాల్లో కేటగిరీ-A కార్యాలయ స్థలం (Office Space)మొత్తం లీజుకు 5-55 మిలియన్ చదరపు అడుగులుగా అంచనా వేస్తున్నారు. ఒక ఆశావాద లెక్కలో, ఈ సంఖ్య 55-60 మిలియన్ చదరపు అడుగుల వరకు ఉండవచ్చు, ఒకవేళ ఈ లెక్కలు తప్పినా కూడా డిమాండ్ 45-50 మిలియన్ చదరపు అడుగులు ఉండవచ్చు. 2024లో వరుసగా మూడోసారి భారత్‌లో ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఐదు కోట్ల చదరపు అడుగులకు మించి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్వీసెస్ హెడ్ అర్పిత్ మెహ్రోత్రా తెలిపారు. Also Read: గోల్డ్ లోన్స్ విషయంలో బ్యాంకులకు ఆర్థిక శాఖ కీలక సూచనలు జెఎల్‌ఎల్ ఇండియా కూడా.. మరోవైపు, 2024 సంవత్సరంలో కార్యాలయానికి డిమాండ్ 450 నుండి 470 లక్షల చదరపు అడుగుల వరకు ఉంటుందని జెఎల్‌ఎల్ ఇండియా డిసెంబర్‌లో తన నివేదికలో పేర్కొంది. 2023 సంవత్సరంతో పోలిస్తే కార్యాలయాల డిమాండ్(Office Space) 20 నుండి 22 శాతం పెరుగుతుందని అంచనా. కోవిడ్ తరువాత వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పని చేస్తున్న ఆఫీసులు ఇప్పుడు హైబ్రిడ్ మోడ్ తో నడుస్తున్నాయి. దీనితో ఆఫీసులు ప్రారంభం అయ్యాయి. ఇక భవిష్యత్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి స్వస్తి పలికే అవకాశాలు ఉన్న నేపథ్యంలో డిమాండ్ పెరిగే అవకాశాలున్నట్టు అంచనా వేస్తున్నారు. 2024లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభంతో ఇతర కార్యకలాపాలు వేగవంతమయ్యే అవకాశం ఉందని, దీంతో ఆఫీస్ స్పేస్ డిమాండ్ పెరగవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. #real-estate #office-space మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి