CUET-PG 2024: NTA నుంచి కీలక అప్‌డేట్‌.. షెడ్యూల్ అవుట్!

CUET-PG షెడ్యూల్‌ను NTA రిలీజ్ చేసింది. మే 15 నుంచి 31 వరకు ప్రతిరోజు రెండు, మూడు షిఫ్టుల్లో హైబ్రిడ్ విధానంలో ఈ పరీక్ష జరగనుంది. ఈ సారి తెలుగుతో సహా 13 భాషల్లో పరీక్షను నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు గరిష్టంగా ఆరు సబ్జెక్టులను ఎంచుకోవడానికి అనుమతించారు.

New Update
CUET-PG 2024: NTA నుంచి కీలక అప్‌డేట్‌.. షెడ్యూల్ అవుట్!

NTA: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET-PG)-2024 షెడ్యూల్‌ను విడుదల చేసింది. CUET-UG కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మే 15 నుంచి 31 వరకు ప్రతిరోజు రెండు, మూడు షిఫ్టుల్లో హైబ్రిడ్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష ఫలితాలు జూన్ 30న వెల్లడికానున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించింది.


అడ్మిట్ కార్డ్ డీటెయిల్స్:
గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి సంబంధించిన పరీక్ష ఇది. మొత్తం 380 నగరాల్లోని కేంద్రాలలో ఈ ఎగ్జామ్‌ను నిర్వహిస్తారు. 13 భాషల్లో ఈసారి ఎగ్జామ్‌ ఉండనుండడం విశేషం. దరఖాస్తు ప్రక్రియ మార్చి 26న ముగుస్తుంది. అభ్యర్థులు మే రెండో వారం నుంచి అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 10:45 వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 12:45 నుంచి 2:30 వరకు, మూడో సెషన్ సాయంత్రం 4:30 నుంచి 6:15 వరకు షెడ్యూల్ చేయబడింది. ఒక్కో సెషన్ 105 నిమిషాల పాటు కొనసాగుతుంది.

పరీక్ష 13 భాషలలో (ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ) నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు గరిష్టంగా ఆరు సబ్జెక్టులను ఎంచుకోవడానికి అనుమతించారు. అభ్యర్థుల సంఖ్య, సబ్జెక్ట్ ఎంపికలను బట్టి రెండు లేదా మూడు షిఫ్టులలో పరీక్షను నిర్వహిస్తారు.

Also Read: తెలంగాణలో రేపే మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. మొత్తం ఎన్ని పోస్టులు అంటే?
WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు