Telangana Elections: తెలంగాణలో ఎన్నికల రోజున వేతనంతో కూడిన సెలవు.. కార్మికశాఖ నిర్ణయం..

నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు జరగనున్న సందర్భంగా.. కర్మాగారాలు, దుకాణాలు, పరిశ్రమల్లో పనిచేసే వారికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కార్మికులందరూ ఓటు వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

New Update
Lok Sabha Elections: లోక్‌సభ ఐదు దశల్లో ఎంత మంది ఓటు వేశారంటే..

తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ జరగనున్న వేళ.. కార్మిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కర్మాగారాలు, దుకాణాలు, పరిశ్రమల్లో పనిచేసే వారికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్షన్ రోజున అందరూ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామని కార్మికశాఖ స్పష్టం చేసింది. ఇదిలాఉండగా.. పోలింగ్ రోజుతో పాటు ముందురోజు కూడా ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ఇవ్వనున్నారు. మొత్తంగా చూసుకుంటే.. 1.06 లక్షల మంది ఉపాధ్యాయుల్లో 80 శాతం మంది ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లోనే పాల్గొంటారు.

Also read: వచ్చేది మా ప్రభుత్వమే.. జగ్గారెడ్డి చెప్పిన లెక్కలివే

దీంతో పోలింగ్ కేంద్రాలుగా ఉండే ప్రభుత్వ పాఠశాలలకు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ముందురోజు మధ్యాహ్నమే తమకు కేటాయించిన ప్రాంతాలకు చేరుకుంటారు. ఈనెల 29న ఉదయం 7 గంటల లోపే ఈవీఎంలను తీసేందుకు ఉపాధ్యాయులు రిపోర్ట్ చేయాల్సి ఉంది. అందుకే ఈ నెల 29, 30 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ఇక పోలింగ్‌ పూర్తైన తర్వాత ఆయా కేంద్రాలకు వెళ్లి ఈవీఎంలను సమర్పించి వచ్చేసరికి అర్ధరాత్రి దాటుతుందని.. దీంతో విధుల్లో పాల్గొన్న వారికి డిసెంబరు 1న కూడా సెలవు ఇవ్వాలని రాష్ట్ర గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్‌, తెలంగాణ మోడల్‌ స్కూల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీఎంఎస్‌టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు ఎన్నికల సంఘాన్ని అభ్యర్థించారు.

Also read: రేవంత్ రెడ్డి పెద్ద దొంగ..చిరుమర్తి లింగయ్య షాకింగ్ కామెంట్స్..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు