JOBS: పది అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేలకు పైగా వేతనం!

నిరుద్యోగులకు మరో తీపి కబురు అందింది. పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 2049 ఉద్యోగాలను భర్తీ చేయనుండగా అర్హతగల అభ్యర్థులు మార్చి 18 వరకూ అప్లై చేసుకోవాలి. ఉద్యోగాన్నిబట్టి బేసిక్ శాలరీ రూ.50 వేలతో మొదలుకానుంది.

New Update
JOBS: పది అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేలకు పైగా వేతనం!

SSC: తెలగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఎన్నికల వేళ నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లు అందుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరుస నోటిఫికేషన్లు వెలువడగా ఏపీలోనూ ఎలక్షన్ ఎఫెక్ట్ తో పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం సైతం వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలన భర్తీ చేసేందుకు సిద్ధమైంది. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) ‘సెలక్షన్‌ పోస్టులు ఫేజ్‌-XII/2024’లో 2049 ఖాళీల భర్తీ చేయనున్నట్లు చెబుతూ అర్హతగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పది, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు కింద సూచించిన విధంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

పదోతరగతితో ఉద్యోగాలు..
ఈ మేరకు పది, ఇంటర్‌, డిగ్రీ, ఫార్మసీ, నర్సింగ్‌, టైపింగ్‌, స్టెనోతోపాటు వివిధ విద్యార్హతలు, నైపుణ్యాలు కలిగివున్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మెడికల్‌ అటెండెంట్‌, లేబొరేటరీ అటెండెంట్‌, క్యాంటీన్‌ అటెండెంట్‌, ఫీల్డ్‌ వర్కర్‌, బేరర్‌/కుక్‌ మేట్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌, టెక్నికల్‌ ఆపరేటర్‌, క్లీనర్‌, ధోబీ, కుక్‌, శానిటరీ వర్కర్‌, సెమీ స్కిల్డ్‌ క్రాఫ్ట్స్‌మెన్‌, ప్లంబర్, ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌, బైండర్‌, స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌, మడ్‌ ప్లాస్టర్‌, డిస్పాచ్‌ రైడర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ప్రతి నెల రూ.30 వేలు వేతనం అందిస్తారు.

ఇంటర్‌ అర్హత కలిగిన వారికోసం..
ఇన్‌సెక్ట్‌ కలెక్టర్‌, సెక్యూరిటీ మెన్‌, స్టోర్‌ కీపర్‌, టెలిఫోన్‌ ఆపరేటర్‌, హెల్త్‌ వర్కర్‌ (ఫిమేల్‌), ఫీల్డ్‌ అసిస్టెంట్‌, లైబ్రరీ అటెండెంట్‌, ఫీల్డ్‌మెన్‌, స్టాక్‌మెన్‌, కార్పెంటర్‌ కమ్‌ ఆర్టిస్ట్‌, లేబొరేటరీ అసిస్టెంట్‌ గ్రేడ్‌-3, క్లర్క్‌, ఎల్‌డీసీ, కాపీహోల్డర్‌, డిప్యూటీ రేంజర్‌ వంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. రూ.35 వేలు వేతనాలుంటాయి.

ఇది కూడా చదవండి: James Anderson : 147 ఏళ్ల టెస్టు క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పిన జిమ్మీ!

డిగ్రీకి పైగా అర్హతలు..
సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌, గర్ల్‌ క్యాడెట్‌ ఇన్‌స్ట్రక్టర్‌, యూడీసీ, గ్రేడ్‌-బీ డేటా ఎంట్రీ ఆపరేటర్‌, అసిస్టెంట్‌ కమ్యూనికేషన్‌ ఆఫీసర్‌, గ్రేడ్‌-ఏ డేటా ప్రాసెసింగ్‌ అసిస్టెంట్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, సీనియర్‌ ట్రాన్స్‌లేటర్‌, నర్సింగ్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌, అకౌంటెంట్‌, అసిస్టెంట్‌ ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఆర్కియాలజిస్ట్‌, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌, ఒకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్‌, అసిస్టెంట్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ తదితర పోస్టులున్నాయి. వీటికి ఎంపికైనవారు మొదటి నెల నుంచే సుమారు రూ.50 వేలకు పైగా వేతనం పొందవచ్చు.

అర్హతలు..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు పరీక్షలో ఉత్తీర్ణత ఉండాలి. కొన్ని పోస్టులకు పరీక్షతోపాటు టైపింగ్‌, డేటా ఎంట్రీ, కంప్యూటర్‌ లిటరసీల్లో ఎందులోనైనా స్కిల్‌ టెస్టు ఉంటుంది. వయసు నిబంధన పోస్టు ప్రకారం మారుతుంది. 2024 జనవరి 1 నాటికి 18-42 ఏళ్లుండాలి. ఎక్కువ పోస్టులకు గరిష్ఠ వయసు 27/28/30 ఏళ్లుగా నియమించారు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు మినహాయింపు ఉంటుంది.

పరీక్ష విధానం:
ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రశ్నాంశాల విధానం అందరికీ ఒకటే. పోస్టును బట్టి ప్రశ్నల కఠినత్వం, స్థాయిలో మార్పులు ఉంటాయి. పదో తరగతి విద్యార్హతతో దరఖాస్తు చేసుకున్న పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలో.. జనరల్‌ ఇంటెలిజెన్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ విభాగాల్లో 25 చొప్పున 100 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. మొత్తం ప్రశ్నపత్రం 200 మార్కులకు ఉండగా తప్పుడు ఆన్సర్ కు అర మార్కు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి గంట. ఇక జనరల్‌ అభ్యర్థులు 30, ఓబీసీ/ఈడబ్ల్యుఎస్‌లు 25, ఇతర విభాగాల వారు 20 శాతం మార్కులు సాధించాలి. 5 కంటే తక్కువ ఖాళీలున్న పోస్టులైతే ఒక్కో దానికీ 30 మందిని, 5 కంటే ఎక్కువ ఖాళీలు ఉంటే 15 మందిని సెలక్ట్ చేస్తారు.

దరఖాస్తు తేదీ:
ఆన్‌లైన్‌ వేదికగా మార్చి 18 వరకు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు:
రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు చెల్లించనవసరం లేదు.

పరీక్ష తేదీలు:
మే 6 నుంచి 8 వరకు.

పరీక్ష కేంద్రాలు:
తెలంగాణ: హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌.

ఏపీ: కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, చీరాల, కడప, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం.

మరిన్ని వివరాలకు ఈ వెబ్‌సైట్‌ ను సంప్రదించండి: https://ssc.nic.in/

Advertisment
Advertisment
తాజా కథనాలు