Most Popular: దేశంలో పాపులర్‌ సీఎం ఎవరో తెలుసా ?

దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో 52.7 శాతంతో ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్ మొదటి స్థానంలో నిలిచారు. 51.3 శాతం ప్రజాదరణతో ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు. మూడో స్థానంలో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ నిలిచారు.

New Update
Most Popular: దేశంలో పాపులర్‌ సీఎం ఎవరో తెలుసా ?

దేశంలో అత్యంత ప్రజాధారణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితాను ఓ ఆంగ్ర పత్రిక విడుదల చేసింది. ఇందులో అత్యంత ప్రజాధారణ కలిగిన సీఎంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌(77) మొదటిస్థానంలో నిలిచారు. ఒడిషాను 20 ఏళ్లకు పైగా పాలిస్తున్న ఆయన 52.7 శాతం ప్రజాదరణతో ఫస్ట్‌ ర్యాంక్‌ను సాధించారు. 2000లో అధికారంలోకి వచ్చిన నవీన్ పట్నాయక్‌.. అప్పటినుంచి ముఖ్యమంత్రి పదవిలోనే కొనసాగుతున్నారు. ఇక అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాన పాత్ర పోషించిన ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో నిలిచారు.

Also Read: కోటాలో మరో విద్యార్థి అదృశ్యం.. వారంలో రెండో ఘటన

ఒక శాతం తేడాతో రెండో స్థానంలో యోగి

నవీన్‌ పట్నాయక్‌ 52.7 శాతంతో ఫస్ట్‌ ప్లేస్‌లో నిలవగా.. 51.3 శాతంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాకు. 2017లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన యోగీ.. యూపీలో అత్యధిక కాలం కొనసాగుతున్న సీఎంగా రికార్డు సృష్టించారు. ఇక అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ 48.6 శాతంతో మూడో స్థానంలో నిలిచారు. ఆయన 2021లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ 42.6 శాతం ప్రజాదరణతో నాలుగో స్థానంలో నిలిచారు. 2021లో గుజరాత్‌ 17వ ముఖ్యమంత్రిగా ఆయన పదవిలోకి వచ్చారు. ఇక త్రిపుర సీఎం మాణిక్ సాహా 41.4 శాతంతో అయిదవ స్థానాన్ని దక్కించుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాణిక్‌ సాహా 2016లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామ చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరి.. 2022లో త్రిపురలో ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు.

Also Read: గర్భిణీపై గ్యాంగ్‌ రేప్‌.. ఆ తర్వాత కిరోసిన్‌ పోసి నిప్పంటించిన దుండగులు

Advertisment