Fearless Animal:సింహాలు, ఏనుగులే కాదు.. ఈ భూమ్మీద భయం లేని జంతువు ఇదే!

పులులు, సింహాలు వంటి మాంసాహారులు అడవిలో అత్యంత ప్రమాదకరమైన, భయం లేని జంతువులుగా గుర్తింపు పొందాయి. కానీ ఏమాత్రం భయం లేని, అడవిలో అత్యంత ధైర్యం ఉన్న జంతువు మరొకటి ఉంది. అదే హనీ బ్యాడ్జర్.దాని గురించి తెలుసుకోండి!

New Update
Fearless Animal:సింహాలు, ఏనుగులే కాదు.. ఈ భూమ్మీద భయం లేని జంతువు ఇదే!

భూమిపై ఎన్నో రకాల జీవులు నివసిస్తాయి. మనుషులతో పాటు విభిన్న రకాల జంతువులు, పశుపక్ష్యాదులకు భూగ్రహం నిలయంగా ఉంది. అయితే ఎక్కువ జీవజాతులు అడవుల్లోనే ఉంటాయి. అభయారణ్యాల్లో ఉండే అన్ని ప్రాణులు జీవ వైవిధ్యాన్ని కాపాడతాయి. అయితే పులులు(Tigers), సింహాలు(Lions) వంటి మాంసాహారులు అడవిలో అత్యంత ప్రమాదకరమైన, భయం లేని జంతువులుగా గుర్తింపు పొందాయి. కానీ ఏమాత్రం భయం లేని, అడవిలో అత్యంత ధైర్యం ఉన్న జంతువు మరొకటి ఉంది. అదే హనీ బ్యాడ్జర్(Honey Badger). ఈ జంతువులు సింహాలను సైతం భయపెట్టగలవు.

హనీ బ్యాడ్జర్ చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది. కానీ తెలివి, ధైర్యం విషయంలో దీన్ని మించిన జంతువు ఈ భూమిపై మరొకటి లేదు. ఈ ప్రెడేటర్ దూకుడుకు మారుపేరు. హనీ బ్యాడ్జర్ ‘ప్రపంచంలోని మోస్ట్ ఫియర్‌లెస్ యానిమల్‌’గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. పులులు, సింహాలు, హైనాలు వంటి పెద్ద, వేటాడే జంతువులను కూడా ఇవి ఎదుర్కోగలవు.హనీ బ్యాడ్జర్స్ చాలా క్రూరమైనవి, తెలివైనవి. పదునైన దంతాలు, గోర్లతో ఇతర జంతువులపై భయంకరంగా దాడి చేస్తాయి. అద్భుతమైన రక్షణ నైపుణ్యాలు ఉన్నప్పటికీ, ఇవి అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్నాయి. మన దేశంలో, జీవవైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్‌లో హనీ బాడ్జర్స్ తరచుగా కనిపిస్తుంటాయి.

ఇవి ఆఫ్రికా, సౌదీ అరేబియా, ఇరాన్‌తో పాటు పశ్చిమ ఆసియా దేశాల్లో నివసిస్తాయి. సౌత్ ఆఫ్రికన్ కంట్రీ లైఫ్ రిపోర్ట్ ప్రకారం.. హనీ బ్యాడ్జర్ల శరీర నిర్మాణం ఇతర జంతువుల దాడి నుంచి రక్షణ పొందేలా ఉంటుంది. పదునైన పంజాలు, దట్టమైన చర్మంతో పాటు చాలా బలమైన దవడలు వీటి సొంతం. అందుకే ఇవి ఏమాత్రం భయపడకుండా తమపైకి దూసుకొచ్చే పెద్ద జంతువులపై తిరిగి దాడి చేస్తాయి. వాటిని భయపెట్టి, తమను తాము రక్షించుకుంటాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Komatireddy Raj Gopal Reddy : నా మంత్రి పదవిని అడ్డుకుంటున్నది జానారెడ్డే...రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కొంతకాలం నుంచి తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తోన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి రాకుండా కొందరు ఢిల్లీస్థాయిలో కుట్రలకు తెర లేపారన్నారు.

New Update
Telangana Elections: అందుకే కాంగ్రెస్‌లోకి పోతున్నా.. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

Komatireddy Raj Gopal Reddy

MLA Komatireddy Raj Gopal Reddy :గత కొంతకాలం నుంచి తనకు మంత్రి పదవి వస్తుందని వస్తుందని ఆశిస్తోన్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి రాకుండా కొందరు ఢిల్లీస్థాయిలో కుట్రలకు తెర లేపారని ఆరోపించారు. మంత్రి పదవి ఇస్తానని పార్టీ హామీ ఇచ్చిందని. తన మంత్రి పదవి విషయంలో కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
జానారెడ్డి వంటివారు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారన్నారు.జానారెడ్డి 30 ఏళ్లపాటు మంత్రి పదవి అనుభవించారు.రంగారెడ్డి, హైదరాబాద్‌కు పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? అంటూ ప్రశ్నించారు.

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

 అధిష్టానం వద్ద తనకు మంత్రి పదవి ఖాయమైనా.. కావాలనే జానా పదేపదే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. 25 ఏళ్లు మంత్రి పదవిలో జానారెడ్డి ఉన్నది సరిపోదా అని ధ్వజమెత్తారు. అధిష్టానం తనపై నమ్మకం ఉంచి మంత్రి పదవి ఇస్తే.. దాన్ని బాధ్యతగా భావిస్తానని కామెంట్ చేశారు. మంత్రి పదవి కోసం తాను ఎన్నడూ అడుక్కోలేదని.. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదు, అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. సమర్థత ఉన్న నాయకులకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాలంటూ రాజగోపాల్ రెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. కాగా తనకు మంత్రి పదవి అనగానే కొంతమంది భయపడుతున్నారని ఆయన అన్నారు. తనకు అధిష్ఠానం మంత్రి పదవి ఇస్తానంటే పార్టీలోని కొందరు సీనియర్ నేతలకు చెమటలు పడుతున్నాయన్నారు. 

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!
 
అయితే మంత్రి వర్గ విస్తరణపై సీనియర్ నేత జానారెడ్డి అధిష్ఠానానికి లేఖ రాశారు. పార్టీలో సీనియర్ నాయకులకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పార్టీ కోసం ఎంతో కాలంగా పనిచేస్తున్న అనుభవజ్ఞులకు అవకాశం ఇవ్వడం ద్వారా ప్రభుత్వం మరింత స్థిరంగా, సమర్థవంతంగా పనిచేయడానికి వీలుంటుందని ఆయన లేఖలో అభిప్రాయపడ్డారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మంత్రి పదవుల ఎంపికలో అనుభవం, ఆయా నాయకుల సామర్థ్యాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిపై సంచలన కామెంట్స్ చేశారు.

Also Read :  ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

అధిష్టానం తనపై నమ్మకం ఉంచి మంత్రి పదవి ఇస్తే.. దాన్ని బాధ్యతగా భావిస్తానని కామెంట్ చేశారు. మంత్రి పదవి కోసం తాను ఎన్నడూ అడుక్కోలేదని.. అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. సమర్థత ఉన్న నాయకులకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాలంటూ రాజగోపాల్ రెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. కాగా తనకు మంత్రి పదవి అనగానే కొంతమంది భయపడుతున్నారని ఆయన అన్నారు.

Also Read :  'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

Advertisment
Advertisment
Advertisment