Uttar Pradesh: కరెంట్‌ బిల్లు రూ.4 కోట్లు.. ఇంటి ఓనర్ షాక్

యూపీలోని నోయిడాలో ఓ రైల్వే ఉద్యోగి బసంత్ శర్మ ఇంటికి రూ.4 కోట్ల కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో ఆయన విద్యుత్‌ అధికారులకు ఫోన్ చేశాడు. వాళ్లు చెక్ చేయగా.. ఎర్రర్ వల్ల కంప్యూటర్ జనరేట్ బిల్లులో పొరపాటు వచ్చినట్లు పేర్కొన్నారు.

New Update
Uttar Pradesh: కరెంట్‌ బిల్లు రూ.4 కోట్లు.. ఇంటి ఓనర్ షాక్

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ రైల్వే ఉద్యోగి బసంత్ శర్మకు ఎప్పట్లాగే జూన్ నెల కరెంట్ వచ్చింది. కానీ ఈసారి బిల్లను చూసిన ఆయన ఒక్కసారిగా షాకైపోయాడు. ఎందుకుంటే వచ్చిన కరెంట్ బిల్లు రూ.4 కోట్లు. బసంత్ శర్మ ఇటీవల ఉదయం ఆఫీస్‌కు వెళ్తుండగా.. తాను అద్దెకు ఇచ్చిన ఇంటికి సంబంధించి కరెంట్‌ బిల్లు మెసేజ్ వచ్చింది.

Also Read: భారీ వర్షాలు.. పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

మొత్తం రూ.4 కోట్ల కరెంటు బిల్లును జులై 24లోపు కట్టాలని ఆ మెసేజ్‌లో ఉంది. అది చూసిన శర్మ కంగుతిన్నాడు. దీంతో ఆయన విద్యుత్‌ అధికారులకు ఫోన్ చేశాడు. వాళ్లు చెక్ చేయగా.. ఎర్రర్ వల్ల కంప్యూటర్ జనరేట్ బిల్లులో పొరపాటు వచ్చినట్లు పేర్కొన్నారు. చివరికి అధికారులు బిల్లును సరిచేసి పంపడంతో బసంత్ శర్మ ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: కారులో బాలికపై అత్యాచారం..వీడియో తీసి బ్లాక్ మెయిల్

Advertisment
Advertisment
తాజా కథనాలు