Sridevi Biopic: అస్సలు పర్మిషన్ ఇవ్వను..శ్రీదేవి బయోపిక్‌పై బోనీకపూర్ రియాక్షన్

అందాల తార, దివంగత శ్రీదేవి బయోపిక్‌ మీద ఆమె భర్త బోనీ కపూర్ స్పందించారు. బాలీవుడ్‌లో దీని మీద వినిపిస్తున్నా వార్తలను ఆయన ఖండించారు. శ్రీదేవి బయోపిక్‌కు పర్మిషన్ ఇచ్చేదే లేదని స్పష్టం చేశారు.

New Update
Sridevi Biopic: అస్సలు పర్మిషన్ ఇవ్వను..శ్రీదేవి బయోపిక్‌పై బోనీకపూర్ రియాక్షన్

Boney Kapoor On Sridevi Biopic: అందం అంటే ఆమెలా ఉండాలి అంటారు. దివి నుంచి భువికి దిగివచ్చిన దేవత ఆమె. ఎందరికో స్వప్న సుందరి. చనిపోయినా అందరి హృదయాల్లో ఇంకా తిష్ట వేసుకుని కూర్చున్న ఒకే ఒక్క హీరోయిన్ శ్రీదేవి. ఈమెను తలదన్నే అందమైన హీరోయిన్ మరొకరు ఇప్పటివరకు రాలేదు అంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి శ్రేదేవి..తను కుటుంబాన్ని, సినీ అభిమానులను సడెన్‌గా వదిలేసి వెళ్ళిపోయారు. ఆమె చనిపోయిన దగ్గర నుంచీ తన బయోపిక్‌ కోసం టాక్స్ వినిపిస్తూనే ఉన్నాయి. వాళ్ళు తీస్తారు...వీళ్ళు యాక్ట్ చేస్తారు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వాటన్నింటికీ పుల్‌స్టాప్‌ పెట్టారు బోనీ కపూర్.

యాక్టర్ల బయోపిక్..

సినిమా హీరోయిన్ల జీవితాలు...చాలా పెద్ద సబ్జెక్ట్. అసలు ప్రతీ యాక్టర్ వెనుకా ఒక కథ ఉంటుంది. అందులోనూ బాలనటిగా ప్రవేశించి..తన అందంతో భారతదేశాన్ని ఒక ఊపు ఊపిన శ్రీదేవి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. ఆమె జీవితంలో ఎత్తుపల్లాలకు కూడా కొదవేమీ లేదు. శ్రీదేవి (Sridevi) జీవితంలో జరిగిన విషయాలు కొన్ని జనాలకు తిప్పటికే తెలుసు. బయోపిక్ తీస్తే మరింత తెలుస్తుంది. అందులోని ఈ మధ్య బయోపిక్‌ల ట్రెండ్ బాగా పెరిగింది కూడా. ఆల్మోస్ట్ ఇప్పటివరకు వచ్చిన జీవిత చిత్రాలు అన్నీ హిట్‌గానే నిలిచాయి కూడా.

 నేను బతికున్నంతవరకు అనుమతినివ్వను..

అయితే శ్రీదేశి బయోపిక్ (Sridevi Biopic) మాత్రం వచ్చేదే లేదు అంటున్నారు ఆమె భర్త బోనీకపూర్. శ్రీదేవి చాలా ప్రవైట్ పర్శన్ అని...ఆమె జీవితాన్ని పబ్లిక్‌లో పెట్టే హక్కు ఎవరికీ లేదని అంటున్నారు. నేను బతికున్నంతవరకూ ఆమె జీవితాన్ని తెరకెక్కించడానికి అనుమతినవ్వనని తెగేసి చెబుతున్నారు బోనీ కపూర్. ఓ ఇంగ్లీఫు మీడియాతో ఈ మాటలు అన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బోనీ కపూర్ నిర్మించి, అజయ్ దేవగన్ నటించిన స్పోర్ట్స్ డ్రామా మైదాన్ ఈనెల 10 రిలీజ్ అవనుంది. ఈ ప్రమోషన్స్‌లో భాంగానే బోనీకపూర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

Also Read:Bihar: బీజేపీ వద్దు…ఇండియాకే మద్దతంటున్న ఎల్‌జేపీ నేతలు

Advertisment
Advertisment
తాజా కథనాలు