Rahul Gandhi : మిస్ ఇండియా జాబితాలో దళిత, గిరిజన, ఓబీసీలు ఎందుకు లేరు–రాహుల్ గాంధీ మిస్ ఇండియా జాబితాలో దళిత, గిరిజన, ఓబీసీలు ఎందుకు లేరని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ అన్నారు.దీన్ని బట్టి 90 శాతం మంది ప్రజలు వ్యవస్థలో భాగం కాలేదని..చాలామందికి నైపుణ్యాలు, ప్రతిభ, విజ్ఞానం ఉన్నా వ్యవస్థతో సంబంధం లేకుండా జీవిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. By Manogna alamuru 25 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Miss India List : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన రాజ్యాంగ గౌరవ సదస్సులో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రసంగించారు. ఇందులో ఆయన కులగణన గురించి మరొకసారి మాట్లాడారు. దేశంలో కులగణన ఎంత ఆవశ్యమో తెలిపారు. ఇది కేవలం జనాభా గణన మాత్రమే కాదని, విధాన రూపకల్పనకు ప్రాతిపదిక అన్నారు. దేశంలో 90 శాతం మంది ప్రజలు అన్ని నైపుణ్యాలున్నా.. వ్యవస్థలో మాత్రం భాగస్వామ్యం కాలేకపోతున్నారని కామెంట్ చేశారు. ఇది కేవలం జనాభా గణన మాత్రమే కాదని, విధాన రూపకల్పనకు ప్రాతిపదిక అన్నారు రాహుల్ గాంధీ. దీంతో పాటూ దేశ సంపద ఎలా పంపిణీ అవుతుందో అర్ధం చేసుకోవాలని చెప్పారు. బ్యూరోక్రసీ, న్యాయవ్యవస్థ, మీడియాలో ఓబీసీలు, దళితులు, కార్మికుల భాగస్వామ్యం ఎంత ఉందో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమన్నారు. మిస్ ఇండియాల్లాంటి (Miss India) వాటిల్లో దళితులు, గిరిజనులు, ఓబీసీ ఎందుకు లేరని రాహుల్ ప్రశ్నించారు. ఇప్పటికీ మీడియా డ్యాన్స్, మ్యూజిక్, క్రికెట్, బాలీవుడ్ గురించి మాట్లాడుతుంది కానీ రైతులు, కూలీల గురించి మాట్లాడదన్నారు. కులగణన తర్వాత బీజేపీ కేవలం ఓబీసీ సెక్షన్ ఇస్తామని చెబుతోంది. కానీ త పార్టీ అధికారంలోకి వస్తే కులాలు, ఉపకులాలు, వారి సామాజిక ఆర్ధిక పరిస్థితులు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుటామని తెలిపారు రాహుల్ గాంధీ. దేశ వ్యాప్తంగా సామాజిక–ఆర్ధిక కులగణనను నిర్వహిస్తామని చెప్పారు. Also Read: Delhi: సెలవు కోసం 5ఏళ్ళ చిన్నారి హత్య..నిందితుల వయసు 9 నుంచి 11 ఏళ్ళు #rahul-gandhi #dalit-woman #miss-india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి