National : కాంగ్రెస్‌కు ఊరట..ఎన్నికల ముందు చర్యలు తీసుకోబోమన్న ఐటీ శాఖ

కాంగ్రెస్ పార్టీకి ఐటీశాఖ శుభవార్త చెప్పింది. ఎన్నికల ముందు పెనాల్టీ, వడ్డీలను వసూలు చేయమని చెప్పింది. ఈరోజు సుప్రీంకోర్టులో ఐటీశాఖ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దాంతో పాటూ దీని మీద ఉన్న కేసు విచారణను జూన్‌కు వాయిదా వేయమని కోర్టును కోరింది. 

New Update
National : కాంగ్రెస్‌కు ఊరట..ఎన్నికల ముందు చర్యలు తీసుకోబోమన్న ఐటీ శాఖ

Congress : లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా ఆదాయపు పన్ను(Income Tax) శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. 2017-18, 2020-21 సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1700 కోట్ల డిమాండ్‌ నోటీసులు ఇచ్చారని.. కాంగ్రెస్ నేత వివేక్ తంఖా తెలిపారు. ఎలాంటి ఉత్తర్వులు, డ్యాకుమెంట్లు లేకుండానే తమకు నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు తాజాగా ఈ విషయంలో కాంగ్రెస్‌కు పెద్ద రిలీఫ్ లభించింది.

ఎన్నికల ముందు చర్యలు ఉండవు...

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నుంచి 1700 కోట్ రూపాయలను రికవరీ చేసేందుకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని ఆదాయపు పన్నుశాఖ స్పష్టం చేసింది. ఈరోజు ఐటీశాఖ(IT Department) ఈ విషయాన్ని సుప్రీంకోర్టు(Supreme Court) కు తెలిపింది. ఎన్నికల సమయంలో ఏ పార్టీకి సమస్యలు సృష్టించమని తెలిపింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన కేసు విచారణను జూన్‌కు వాయిదా వేయాలని ఐటీశాఖ కోర్టును కోరింది. అంతకుముందు పన్ను విధింపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దాన్ని హైకోర్టు తిరస్కరించింది.

కావాలనే చేస్తున్నారు..

పార్లమెంటు ఎన్నికల(Parliament Elections) వస్తున్న నేపథ్యంలోనే తమ పార్టీని ఇబ్బందులకు గురిచేసేందుకు కేంద్ర ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలని కాంగ్రెస్ నేతలు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై గత గురువారం విచారించిన న్యాయస్థానం పిటిషన్లు కొట్టివేసింది.

ఇప్పటికే రూ.1.35 కోట్లు..

కాంగ్రెస్‌(Congress) పై చర్యలు చేపట్టేందుకు ఐటీ అధికారుల దగ్గర ఆధారాలున్నాయని.. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు(High Court) తెలిపింది. అలాగే అంతకుముందు 2014-15 నుంచి 2016-17కు సంబంధించి ఐటీ శాఖ చేపట్టిన పునఃపరిశీలనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లను కూడా ఈ కారణాలతోనే న్యాయస్థానం తిరస్కరించింది. ఈ పునఃపరిశీలనకు సంబంధించి కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల నుంచి ఇప్పటికే రూ.1.35 కోట్లు రికవరీ చేసింది ఆదాయపు పన్ను శాఖ.

Also Read : Delhi: కేజ్రీవాల్‌కు షాక్..జ్యూడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు

Advertisment
Advertisment
తాజా కథనాలు