Gold Rate today: బంగారం మరింత కిందికి.. కొనాలంటే సూపర్ ఛాన్స్.. 

బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న తగ్గుదల నమోదు చేసిన బంగారం ఈరోజు మార్పులు లేకుండా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,590ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.62,830ల వద్దకు చేరాయి. వెండి ధర కేజీకి 300 పెరిగి  రూ.75,700 వద్ద ఉంది.

New Update
Gold Rate today: బంగారం మరింత కిందికి.. కొనాలంటే సూపర్ ఛాన్స్.. 

Gold Rate today: బంగారం ధరలు ప్రతిరోజూ పైకీ.. కిందికీ కదులుతూనేఉంటాయి. సాధారణంగా పెరగడమే నెల రోజుల క్రితం వరకూ చూస్తూ వచ్చాము. అయితే, ఫిబ్రవరి నెలలో మాత్రం ఎక్కువగా బంగారం తగ్గుదలనే చూపించింది. ఇక గత నాలుగు రోజలుగా వరుసగా బంగారం ధరలు కాస్త కాస్త తగ్గుతూనే ఉన్నాయి. పెద్దగా ఎక్కువ కాకున్నా.. 100 నుంచి 200 రూపాయల మధ్యలో బంగారం ధరలు తగ్గడం జరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఈరోజు అంటే మార్చి 1న బంగారం ధరల్లో స్థిరత్వం కనిపించింది.  బంగారం ధరల(Gold Rate today) తగ్గుదల – పెరుగుదలపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు అనిశ్చితంగా ఉండడం.. అలాగే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో పెరుగుదల తగ్గుదల.. స్థానికంగా పెళ్లిళ్ల సీజన్ ఇవన్నీ బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి.  ఈరోజు అంటే మార్చి 1న అంతర్జాతీయ స్థాయిలో బంగారం ధర(Gold Rate Today) స్వల్పంగా పెరిగింది.  అయితే, దేశీయంగా మాత్రం  బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. మరోవైపు నిన్న భారీగా తగ్గిన వెండి ధరలు ఈరోజు  కాస్త పెరిగాయి.  ఈరోజు అంటే శుక్రవారం (మార్చి 1) మార్కెట్ ప్రారంభ సమయానికి బంగారం, వెండి ధరలు (Gold Rate today) దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.                

హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్(Hyderabad) లో ఈరోజు బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి.  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం(Gold and Silver Price) ధర మార్పు లేకుండా దీంతో  రూ.57,590ల వద్దఉంది.  24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు ఎలాంటి మార్పు లేకుండా  రూ. 62,830ల వద్ద నిలిచింది. 

ఢిల్లీలో బంగారం ధరలు ఇలా..
అలాగే ఢిల్లీలో కూడా బంగారం ధరలు(Gold Rate today) స్థిరంగా ఉన్నాయి.  ఇక్కడ  22 క్యారెట్ల బంగారం ధర(Gold and Silver) రూ.57,740ల వద్ద నిలకడగా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.62,990ల వద్ద మార్పులు లేకుండా ఉంది. 

Also Read : బంగారం దోబూచులాట.. తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగింది.. ఎంతంటే.. 

వెండి ధరలు ఇలా..
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం ధరలు(Gold Rate Today) స్థిరంగా ఉంటే.. రెండురోజులుగా తగ్గుతూ వచ్చిన వెండి ధరలు ఈరోజు కాస్త పైకెగశాయి. హైదరాబాద్ లో వెండి కేజీకి 300 రూపాయలు పెరిగి  రూ.75,700ల వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే, ఢిల్లీ(Delhi) లోనూ వెండి రేటు 300 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ కేజీ వెండి ధర రూ. 74,200ల వద్ద ఉంది. 

అంతర్జాతీయంగా..
మరోవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు కొద్దిగా పెరుగుదల నమోదు చేశాయి.  ఈరోజు ఔన్స్ బంగారం(Gold Rate today)  2043డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా స్పాట్ వెండి ధర కాస్త తగ్గడంతో(Gold And Silver Price) ఔన్స్ 22.68 డాలర్లుగా ఉంది.  

గమనిక : బంగారం ధరలు అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయంగా ఉండే డిమాండ్, స్థానికంగా ఉండే పన్నులు, సెస్సులు ఆధారంగా ఎప్పటికప్పుడు మారుతూ వస్తాయి. ఇక్కడ ఇచ్చిన ధరలు జ్యువెలరీ అసోసియేషన్ వెబ్ సైట్ లో ఇచ్చిన ధరల ఆధారంగా.. ఈరోజు మార్కెట్ ప్రారంభసమయానికి ఉన్నవి. బంగారం, వెండి కొనుక్కోవాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు