నాది స్మార్ట్‌ బుర్ర.. రాహుల్ ఏం చెప్పిండో తనకే అర్థం కాలేదంటూ అరవింద్ చురకలు

రాహుల్ స్పీచ్‌పై నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ సెటైర్లు వేశారు. రాహుల్‌ గాంధీ స్పీచ్‌ అసలేం అర్థంకాలేదన్నారు. లోక్‌సభలో రాహుల్ ఏం మాట్లాడారో తన స్మార్ట్ బుర్రకే అర్థంకాలేదని.. ఇక కామన్‌మ్యాన్‌కి ఏం అర్థం అవుతుందంటూ కౌంటర్లు వేశారు.

New Update
నాది స్మార్ట్‌ బుర్ర..  రాహుల్ ఏం చెప్పిండో తనకే అర్థం కాలేదంటూ అరవింద్ చురకలు

Dharmapuri arvind on rahul gandhi speech and nama nageswar rao: లోక్‌సభలో రాహుల్‌ గాంధీ స్పీచ్‌ వినలేకపోయానంటూ చురకలంటించారు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌. అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగించిన విషయం తెలిసిందే. రాహుల్ స్పీచ్‌పై అరవింద్‌ సెటైర్లు వేశారు. రాహుల్‌ గాంధీ స్పీచ్‌ విందాం అనే అనుకున్నానని.. సగం కంటే ఎక్కువ  వినలేకపోయానన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థంకాలేదన్నారు అరవింద్‌. నా బుర్రకి ఆయన చెప్పింది ప్రాసెస్ కాలేదంటూ కౌంటర్లు వేశారు. ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు.. ఏం మాట్లాడుతున్నాడు.. నో కాన్ఫిడెన్స్‌ మోషన్‌కి ఆయన మాట్లాడిన దానికి సంబంధం ఏంటన్నది తెలియడంలేదన్నాడు. తనది వన్‌ ఆఫ్‌ ది స్మార్ట్ బుర్ర అని.. తనకే ఎక్కలేదంటే ఇంకా సామాన్యూలకు ఎలా ఎక్కుతుందని ప్రశ్నించారు.

నామా నాగేశ్వరరావుకు కౌంటర్లు?
ఇంటింటికి మంచి నీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అంటూ బీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు అరవింద్‌. నాగేశ్వరరావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. గతంలో కేటీఆర్‌ గుజరాత్‌లో ఇంటింటికి నీళ్లు ఎలా ఇస్తున్నారన్నదానిపై స్టడీ చేశారని.. ప్రముఖ వార్తపత్రికల్లో కూడా ఈ విషయం వచ్చిందన్నారు. మీ వయసుకు అబద్ధాలు తగవని.. బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వచ్చిన తర్వాతే నామా నాగేశ్వరరావు ఇలా తయారయ్యారంటూ చురకలంటించారు. బీఆర్‌ఎస్‌ నుంచి ఎంత త్వరగా బయటకు వస్తే అంత మంచిదంటూ హితవు పలికారు. లేకపోతే ఉన్న పరువు పొగొట్టుకున్నట్టు అవుతుందన్నారు అరవింద్.

నామా ఏమన్నారంటే?
నిన్న లోక్‌సభలో నామా నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తులకు 24 గంటలూ ఉచిత కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. అమెరికాలో పవర్ కట్ ఉండొచ్చేమో.. కానీ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా కరెంట్ పోదన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రం అంధకారంలో ఉండేదన్నారు. టల దిగుబడిలో పంజాబ్‌ ను అధిగమించి రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నామని గుర్తుచేశారు. అటు తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలు ఒక్కటీ అమలు చేయలేదన్నారు.. నవోదయ విద్యాలయాలు, ఐటీఐఆర్‌, ఐఐఎం, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని నామా మండిపడ్డారు. నీతి అయోగ్‌ సిఫారసు చేసినా నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు.

బయ్యారం స్టీల్ ప్లాంట్‌ గురించి అడిగానన్నారు నామా నాగేశ్వరరావు. బీఆర్‌ఎస్‌ నేతల ప్రెస్‌మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవ్వాల్సిన ప్రాజెక్టులు ఇవ్వకుండా క్యాన్సిల్‌ చేశారన్నారు. ప్లానింగ్‌ కమిషన్‌ని స్క్రాప్‌ చేసి.. నీతి అయోగ్‌ని తీసుకొచ్చారని.. మిషన్‌ భగీరథ రూ. 24వేల కోట్లు రిక్వెస్ట్ చేస్తే బీజేపీ ఇవ్వలేదన్నారు. తమ దగ్గర నుంచి తీసుకుపోవడమే కానీ ఇచ్చిందేమీ లేదని విమర్శించారు. - నామా నాగేశ్వరరావు.

మణిపూర్‌ ఇష్యూ ఒక్క రాష్ట్రానిది కాదు.. యావత్ దేశానిదన్నారు బీఆర్‌ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. మణిపూర్‌పై చర్చ పెట్టడానికే అవిశ్వాస తీర్మానం ఇచ్చామన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు