Bihar : రసవత్తరంగా బీహార్ పాలిటిక్స్.. సీఎం పదవికి నితీశ్ రాజీనామా..! బీహార్ సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. గవర్నర్ కు రాజీనామా లేఖను సమర్పించారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు బీజేపీ మిత్రపక్షంగా మళ్లీ ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కూటములను మార్చడం నితీశ్ కుమార్‌కు ఇదేమీ కొత్త కాదు. By Trinath 28 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Bihar Political Drama : బీహార్(Bihar) లో కొనసాగుతున్న రాజకీయ గందరగోళం మధ్య నితీశ్ కుమార్(Nitish Kumar) తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా(Resign) చేశారు. జేడీయూ ఎమ్మెల్యేలతో సమావేశం తర్వాత నితీశ్ కుమార్ రాజీనామా లేఖను సమర్పించేందుకు రాజ్‌భవన్(Raj Bhavan) కు వెళ్లారు. అక్కడ గవర్నర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు. నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు ఎన్డీయే మద్దతుతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. జేడీయూ శాసనసభా పక్ష సమావేశంలో నితీశ్ కుమార్ బీజేపీ సీనియర్ నేతతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. మరోవైపు ప్రమాణ స్వీకారానికి రాజ్‌భవన్‌లో సన్నాహాలు ప్రారంభమయ్యాయి. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఈరోజు సాయంత్రం తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజే నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. యూటర్న్‌లు అలవాటే: కూటములను మార్చడం నితీశ్ కుమార్‌కు ఇదేమీ కొత్త కాదు. ఇంతకు ముందు కూడా ఇలా చాలాసార్లు చేశారు. దశాబ్ద కాలం ఎన్డీయేతో ఉన్న అనుబంధాన్ని కాదనుకుని 2013లో నితీశ్ ఎన్డీయే నుంచి బయటకు వచ్చేశారు. అప్పుడే అందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకుని అదే పార్టీలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు నితీశ్. అటువైపు ఎన్డీఏలోకి జేడీయూని కలుపుకోవడానికి బీజేపీ(BJP) నాయకత్వం కూడా సిద్ధంగానే ఉంది. ఎందుకంటే నితీశ్ కుమార్ ఇండియా కూటమి నుంచి విడిపోతే ఎన్డీయే, బీజేపీకి బలం చేకూరినట్టే . నితీశ్ విషయంలో ఈసారి బీజేపీ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఒకవేళ ఆయన ఎన్డీయే(NDA) కూటమిలోకి వచ్చినా ఈసారి బీజేపీదే పైచేయి అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. 8 నుంచి 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని, అంకెల గేమ్‌లో ఏదైనా అవకతవకలు జరిగితే, బ్యాకప్ ప్లాన్ సిద్ధంగా ఉండాలని అంటున్నారు. అదే సమయంలో, ప్రభుత్వ ఏర్పాటుకు ముందు, బీజేపీ తన మునుపటి మిత్రపక్షాలైన చిరాగ్ పాశ్వాన్, జితన్ మాంఝీలను కూడా బరిలోకి దించాలని కోరుతోంది. ఈ విషయాలన్నింటిపై బీజేపీ తరపున అమిత్ షా(Amit Shah), జేపీ నడ్డా(JP Nadda) సహా పార్టీ సీనియర్ నేతలు ఇప్పటికే సమావేశమయ్యారు. ఇందులో నితీష్ కుమార్ సహా మిత్రపక్షాలందరికీ లోక్ సభలో ఎలాంటి వాటా ఇస్తారనే దానిపై చర్చ జరిగింది. Also Read: స్క్రిప్ట్ ఇస్తే చాలు.. వీడియో రెడీ.. AIతో గూగుల్ సంచలనం WATCH: #nda #nitish-kumar #raj-bhavan #bihar-cm-resigns మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి