Nithin : మహేష్, బన్నీ బాటలో నితిన్.. ఫస్ట్ టైం ఆ బిజినెస్ లోకి..?

మహేష్, బన్నీ, విజయ్ దేవరకొండ, లాంటి హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్తున్నారు. తాజాగా లవర్ బాయ్ నితిన్ సైతం ఈ లిస్ట్ లో చేరిపోయాడు. నితిన్ ఏషియన్ సంస్థతో కలిసి 'ANS' సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ప్రారంభించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

New Update
Nithin : మహేష్, బన్నీ బాటలో నితిన్.. ఫస్ట్ టైం ఆ బిజినెస్ లోకి..?

Nithiin Into Multiplex Business : మన టాలీవుడ్ (Tollywood) హీరోలు సినిమాలతో పాటూ ఇతర రంగాల్లోనూ రాణిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మహేష్, బన్నీ, విజయ్ దేవరకొండ, లాంటి హీరోలు మల్టీప్లెక్స్ బిజినెస్ (Multiplex Business) లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్తున్నారు. ఈ మధ్య మన మాస్ మహారాజా రవితేజ కూడా ఇదే బిజినెస్ లోకి అడుగుపెట్టాడు. ఇక తాజాగా లవర్ బాయ్ నితిన్ సైతం ఈ లిస్ట్ లో చేరిపోయాడు.

నితిన్ మల్టీప్లెక్స్...

హీరో నితిన్ (Nithiin) ఏషియన్ సంస్థతో కలిసి 'ANS' సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ప్రారంభించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. నితిన్‌కు ఇంత‌కుముందే సితార థియేట‌ర్ ఉన్న విష‌యం తెలిసిందే. తెలంగాణ సంగారెడ్డిలో ఉన్న ఈ థియేట‌ర్ ప్ర‌స్తుతం రేనోవేష‌న్‌లో ఉంది. అయితే ఇదే థియేట‌ర్‌ను ఏషియన్ సంస్థతో కలిసి స‌రికొత్త హంగుల‌తో మల్టీప్లెక్స్ నిర్మిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఇక ఈ థియేట‌ర్‌కు 'ఏషియన్ నితిన్ సితార'(ANS) అని పేరు పెట్టిన‌ట్లు సమాచారం.

publive-image

Also Read : అబ్బాయి ప్లేస్ లో బాబాయ్ సినిమా.. ‘NBK109’ నుంచి మాస్ అప్డేట్!

త్వరలోనే నితిన్ ఈ మల్టీప్లెక్స్ ను గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నితిన్ సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది ' ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ప్రెజెంట్ వెంకీ కుడుములతో 'రాబిన్ హుడ్', వేణు శ్రీరామ్ తో ' తమ్ముడు' వంటి సినిమాలు చేస్తున్నాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ram Charan Peddi: 'పెద్ది'తో రామ్ చరణ్ ఊచకోత.. ఇదయ్యా నీ అసలు రూపం..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటిస్తున్న "పెద్ది" చిత్రం గ్లింప్స్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. థియేట్రికల్, ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్‌లో రికార్డు ఆఫర్లు వస్తున్నాయి. ఈ మూవీకి AR రెహమాన్ సంగీతం అందిస్తుండగా, వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది.

New Update
Ram Charan Peddi

Ram Charan Peddi

Ram Charan Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దేవర బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor), టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా(Buchibabu Sana) కలిసి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం "పెద్ది". ఈ సినిమా ఇటీవల విడుదలైన గ్లింప్స్‌తో ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచింది. అప్పటివరకు అంతగా లేని క్రేజ్ గ్లింప్స్‌ విడుదయాలయ్యాక అమాంతం పెరిగిపోయింది.

Also Read: ఆ ఒక్క విషయంలో వెనక్కి తగ్గిన ఎన్టీఆర్ 'వార్-2'

"పెద్ది" కు థియేట్రికల్, ఓటిటి లలో కూడా భారీ ఆఫర్లను వస్తున్నాయి. ఈ రకంగా చూసుకుంటే "పెద్ది" భారీ రికార్డులు కొల్లగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ పై అభిమానుల్లో ఉన్న అంచనాలను మించేలా డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడట. 

Also Read: పిల్లలు థియేటర్ వైపు రావొద్దు.. హిట్-3 సెన్సార్ షాకింగ్ రిపోర్ట్

ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌లో అత్యధిక రేటు

అలాగే, ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌లో అత్యధిక రేటు ఆఫర్ కూడా "పెద్ది" సినిమాకు ఇచ్చారని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తుండగా, వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తోంది. మరి రిలీజైనా తరువాత ఈ చిత్రం ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Also Read: "క్రిష్ 4" లో ప్రియాంక చోప్రా ఫిక్స్..

Also Read: మేటర్ పెద్దదే..! ఇంట్లో వాళ్ళతో మాత్రం అస్సలు చూడకండి..

Advertisment
Advertisment
Advertisment