Forbes women list:ఫోర్బ్స్ శక్తిమంతుల జాబితాలో నిర్మలా సీతారామన్..మరో ముగ్గురు

ప్రపంచంలోని వంద మంది శక్తిమంతమైన మహిళల జాబితాను ఈ ఏడాదికి గానూ ఫోర్బ్స్ ప్రకటించింది. ఇందులో నలుగురు బారతీయ మహిళలు ఉన్నారు. వీరిలో ఆర్ధిక మంత్రి సీతారామన్ 32వ స్థానంలో ఉన్నారు.

New Update
Forbes women list:ఫోర్బ్స్ శక్తిమంతుల జాబితాలో నిర్మలా సీతారామన్..మరో ముగ్గురు

ప్రతీ ఏడాది పోర్బ్స్ బిజినెస్ మ్యాగజైన్ వంద మంది శక్తిమంతమైన మహిళల జాబితాను విడుదల చేస్తోంది. ఇందులో భారతదేశం నుంచి నలుగురు మహిళలు ఉన్నారు. వీరిలో మన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 32వ స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ జాబితాలో సీతారామన్ చోటు సంపాదించుకోవడం ఇది వరుసగా ఐదవసారి. ఇక ఆమె తోపాటు మరో ముగ్గురు భారతీయ మహిళలఉ ఇందులో చోటు సంపాదించుకున్నారు. హెచ్‌సీఎల్‌ కార్పోరేషన్‌ సీఈవో రోష్నీ నాదర్‌ మల్హోత్రా(60వ స్థానం), స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చైర్‌పర్సన్‌ సోమ మొండల్‌(70వ స్థానం), బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌ షా(76వ స్థానం)లో ఉన్నారు.

Also Read:నువ్వు కూడా ఏడుస్తావా..కిమ్ కన్నీళ్ళు పెట్టుకుంటున్న వీడియో వైరల్

ఇక ప్రపంచ మొత్తం విషయానికి వస్తే శక్తిమంతమైన మహిళల జాబితాలో యూరోపియన్‌ కమిషన్‌ చీఫ్‌ ఉర్సులా వాన్‌ దెర్‌ లెయెన్‌ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. రెండో స్థానంలో యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ అధిపతి క్రిస్టినా లగార్డ్‌ , మూడో స్థానంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఉన్నారు. నాలుగో స్థానంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని , ఐదులో అమెరికా గాయని టేలర్‌ స్విప్ట్‌ చోటు దక్కించుకున్నారు.

నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్ధిక మంత్రిగా 2019 నుంచి ఉన్నారు. దీంతో పాటూ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కూడా ఆమే నిర్వహిస్తున్నారు. నిర్మలా రాజకీయాల్లోకి రాక ముందు బ్రిటన్‌ అగ్రికల్చర్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌, బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌లలో కీలక పదవులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆర్థిక శాఖతోపాటు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. జాతీయ మహిళా కమిషన్‌లో సభ్యురాలిగా ఉన్నారు.

Also read:70 ఏళ్ళుగా వారు దానికి అలవాటు పడిపోయారు, జాగ్రత్త..పీఎం మోడీ పోస్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు