Nayeem: నయీం కేసులో బిగ్ ట్విస్ట్.. మిస్టరీగా మారిన అనుచరుడి మర్డర్ కేసు! గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడు బాలన్న మర్డర్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకొస్తున్నాయి. బాలన్న అప్రూవర్‌గా మారి తమ పేర్లు ఎక్కడ బయట పెడతాడోనని డ్రగ్స్‌కు బానిసైన బాలన్న కొడుకును పావుగా వాడుకుని మర్డర్ చేయించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. By srinivas 09 Apr 2024 in క్రైం టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Crime: తెలుగు రాష్ట్రాల్లో పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడు బాలన్న మర్డర్ కేసు మిస్టరీగా మారింది. కొత్త కొత్త కోణాలు వెలుగులోకొస్తున్నాయి. నయీం కేసు రీఓపెన్ చేయాలని డిమాండ్లు తెరపైకి రావడం, ఆ వెంటనే బాలన్న హత్యకు గురికావడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. కొడుకు నిజంగానే డ్రగ్స్‌కి బానిసై బాలన్నను హత్య చేశాడా? లేక కొడుకుతో ఎవరైనా హత్య చేయించారా? నయీం రైట్ హ్యాండ్‌గా ఉన్న బాలన్న మర్డర్ వెనుక అసలేం జరిగింది? కేసు రీఓపెన్ చేయాలంటూ.. నయీం క్లోజ్ ఫ్రెండ్ బాలన్న మర్డర్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకొస్తున్నాయి. నయీం కేసు రీఓపెన్ చేయాలంటూ పొలిటికల్ తెరపై డిమాండ్లు ఎక్కువవుతున్న నేపథ్యంలో నయీం రైట్ హ్యాండ్ బాలన్న, తన కొడుకు అనురాగ్ చేతిలో అతికిరాతకంగా హత్యకు గురికావడం హాట్ టాపిక్‌గా మారింది. మరెన్నో అనుమానాలకు దారి తీస్తోంది. అనురాగ్‌ను పావుగా వాడుకుని బాలన్నను కావాలనే హత్య చేయించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనురాగ్ డ్రగ్స్ తీసుకుని క్షణికావేశంలో చేసిన హత్య కాదు కావాలనే పథకం ప్రకారం తండ్రిని చంపాడాన్న కొశ్వన్స్ తెరపైకొస్తున్నాయి. నయీం అక్రమాల్లో కీలక పాత్ర.. మాజీ నక్సలైట్ బాలన్న.. నయీం హయాంలో చెలరేగిపోయాడు. ఇష్టానుసారంగా వ్యవహరించారు. నయీంని కలవాలంటే ఫస్ట్ బాలన్నను కలవాల్సిన పరిస్థితి ఉండేది. అలాగే నయీంకి సంబంధించిన ప్రతి విషయం బాలన్నకి తెలుసు. నయీం అక్రమాల్లో కీలక పాత్ర పోషించాడు బాలన్న. నయీంకి నమ్మినబంటుగా ఉంటూ బాగానే ఆస్తులు వెనకేసుకున్నాడు. నయీం అక్రమాల దగ్గర్నుంచి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ బాలన్నకు తెలుసు. నయీం ఆర్ధిక లావాదేవీలన్నీ బాలన్నే చూసుకునేవాడు. అయితే నయీం 2016లో చనిపోయిన తర్వాత మూడేళ్లపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన బాలన్న ఆ తర్వాత బయటకొచ్చి చాలా సైలెంట్ అయిపోయాడు. తనకున్న వ్యాపారాలు చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాంగ్రెస్, బీజేపీ నేతలు డిమాండ్.. అయితే నయీం కేసు రీఓపెన్ చేయాలంటూ ఇటీవల అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో నయీం కేసులో అవకతవకలు జరిగాయని నయీం అక్రమాస్తుల్నీ బయట పెట్టాలని, నయీంకి సహకరించిన వారిని కనిపెట్టాలని డిమాండ్ చేశారు. అలా నయీం డైరీ ఓపెన్ చేయాలంటూ పొలిటికల్ రచ్చ మొదలైందో లేదో బాలన్న చనిపోవడం పలు అనుమానాలకు కారణమవుతోంది. నయీం కేసు రీఓపెన్ చేస్తే ఫస్ట్ విచారించేది బాలన్ననే అని భావించిన కొందరు, ఆయన హత్యకు ప్లాన్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలన్న అప్రూవర్‌గా మారి తమ పేర్లు ఎక్కడ బయట పెడతాడోనని డ్రగ్స్‌కు బానిసైన కొడుకును పావుగా వాడుకుని మర్డర్ చేయించారా అన్న కోణాలు తెరపైకొస్తున్నాయి. ఒకవేళ ప్లానింగ్ ప్రకారమే మర్డర్ జరిగి ఉంటే దీని వెనుక ఎవరున్నట్లు? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. మరోవైపు బాలన్నపై ఇప్పటికే 35కు పైగా మర్డర్ కేసులున్నట్లు గుర్తించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లోనూ విచారణ సాగిస్తున్నారు. అనురాగ్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో మరికొన్ని రోజుల్లో బాలన్న మర్డర్‌పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. #murder-case #follower-balanna #gangster-nayeem మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి