/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-01T185128.551-jpg.webp)
Kurchi Madathapetti Song: డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ (Mahesh Babu) నటించిన లేటెస్ట్ చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రం జనవరి 12 న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి దీని పై ఏదో ఒక వివాదం వినిపిస్తూనే ఉంది. తాజాగా గుంటూరు కారం (Guntur Kaaram) నుంచి రిలీజైన కుర్చీ మడతపెట్టి సాంగ్ సోషల్ మీడియాలో చర్చగా మారింది. మహేష్ బాబు సినిమా పాటలో ఇలాంటి బూతు పదం వాడడం ఏంటని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తూ.. నెట్టింట్లో ట్రోల్ల్స్ మీమ్స్ మొదలు పెట్టారు. అసలు ఈ పాట గురించి మహేష్ బాబు తెలుసా.. త్రివిక్రమ్ ఎలా ఒకే చేశారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరో వైపు ఈ పాటలో మహేష్ బాబు డాన్స్ స్టెప్స్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సహజంగా మహేష్ బాబు సినిమాల్లో డాన్స్ నెంబర్ తక్కువగా ఉంటాయి. కానీ ఈ పాటలో మహేష్ బాబు మాస్ డాన్స్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉంది. కొంత మంది పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటే.. మరి కొంత మంది అసహనంగా ఉన్నారు.
Also Read: YS Sharmila : కుమారుడి వివాహంపై షర్మిల కీలక ప్రకటన.. రేపు ఇడుపులపాయకు కుటుంబ సమేతంగా..!
ఇది ఇలా ఉంటే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman S) పై నెట్టింట్లో మరో చర్చ మొదలైంది. 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ మ్యూజిక్ కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వైరల్ గా మారాయి. ఈ పాట మ్యూజిక్ అత్తారింటికి దారేదిలోని 'బేట్రాయి సామి దేవుడా' ' సాంగ్ మ్యూజిక్ ను పోలి ఉందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తూ.. థమన్ మళ్ళీ కాపీ కొట్టాడుంటూ సెటైర్లు వేస్తున్నారు.
#Thaman Malli Dorikipoyadu😂!!#MaheshBabu #GunturKaaramOnJan12th #KurchiMadathapetti #KurchiniMadathapetti #Sreeleela #Trivikram #GunturKaraam #GunturKaaramOnJan12 pic.twitter.com/sQ5wZRCsmM
— METARUN (@NagaTarunT) December 30, 2023
Also Read: January Release: సంక్రాంతి విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు.. రిలీజ్ డేట్స్ ఇవే