Israel-Hamas War: కాల్పుల విరమణకు అంగీకరించే ప్రసక్తే లేదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు చేపట్టిన మెరుపు దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ గాజాపై విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో హమాస్ మిలిటెంట్లతో కాల్పుల విరమణ చేసేందుకు అంగీకరించమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌పై జరిగిన దాడులను ఏ నాగరికత దేశం సహించదని పేర్కొన్నారు.

New Update
Israel-Hamas war:మీకు వేరే దారి లేదు..హమాస్‌కు నెతన్యాహు అల్టిమేటం

ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా చల్లారలేదు. ఇప్పటికే వేలాదిమంది అమాయకులు ఈ దాడుల్లో మరణించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్ మిలిటెంట్లతో కాల్పుల విరమణకు అంగీకరించే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. ఒకవేళ అలా చేసినట్లైతే ఉగ్రవాదుల ముందు ఇజ్రాయెల్ లొంగిపోయినట్లు అవుతుందని అన్నారు. హమాస్ ఉగ్రవాదులను హతం చేసే ప్రయత్నంలో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ఏ యుద్ధం కూడా సామాన్య పౌరుల ప్రాణాలను కోరుకోదని.. గాజాలో ఇజ్రాయెల్ చేస్తోన్నటువంటి యుద్ధం నాగరికత-అనాగరికత మధ్య జరుగుతున్న పోరు అని స్పష్టం చేశారు.

అలాగే హమాస్‌తో యుద్ధం జరుగుతున్న తరుణంలో ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రవేశపెట్టిన మానవతా సంధీ తీర్మానం లోపభూయిష్ఠంగా ఉందని నెతన్యాహు అన్నారు. ఇజ్రాయెల్‌లో జరిగిన దారుణాలను ఏ నాగరిక దేశం కూడా సహించదని ఉద్ఘాటించారు. కాల్పుల విరమణకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. పెరల్ హర్బర్, 9/11 దాడులు జరిగిన తర్వాత అమెరికా ఎలాగైతే కాల్పుల విరమణకు అంగీకరించలేదో.. అలాగే ఇజ్రాయెల్ కూడా అందుకు అంగీకరించదని తేల్చి చెప్పారు. అంతేకాదు ఈ యుద్ధం అనేది తమ భవిష్యత్తుకు సంబంధించినదని స్పష్టం చేశారు.

Also read: ‘పిల్లల్ని కనండి ప్లీజ్‌..’ మహిళలను బుజ్జగిస్తోన్న చైనా అధ్యక్షుడు!

ఇదిలాఉండగా.. హమాస్ మిలిటెంట్లను నాజీ జర్మనీతో పోలుస్తూ ఐక్యరాజ్యసమితీ వేదికగా ఇజ్రాయెల్‌ తీవ్ర ఆరోపణలు చేసింది. నాజీల ఆధీనంలో యూదలపై మారణకాండ జరిగినప్పుడు ఈ ప్రపంచం నిశబ్దంగానే ఉందని.. ఇప్పుడు హమాస్ కూడా అలాంటి పని చేసినప్పుడు ప్రపంచం నిశబ్దంగానే ఉందని తెలిపింది. కొన్ని సభ్యదేశాలు 80 ఏళ్ల కాలంలో ఏమీ కూడా నేర్చుకోలేదని చెప్పింది. అసలు ఐక్యరాజ్యసమితి ఎందుకు ఏర్పడిందనే విషయాన్ని కూడా కొందరు మర్చిపోయారని.. ఇక నుంచి మీరు నా వైపు చూసినప్పుడల్లా ఈ విషయాన్ని గుర్తుచేస్తానని ఐరాసలోని ఇజ్రాయెల్‌ అంబాసిడర్ గిలాడ్‌ ఎర్డాన్ పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు