AP: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. ఆపరేషన్ వికటించి బాలింత మృతి!

నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో ఏమల శ్రావణి అనే బాలింత మరణించింది. మృతదేహంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు.

New Update
AP: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. ఆపరేషన్ వికటించి బాలింత మృతి!

Nellore: ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. గూడూరు ప్రభుత్వ హాస్పిటల్‌లో వైద్యుల నిర్లక్ష్యంతో ఏమల శ్రావణి (21) అనే బాలింత మరణించింది. కాన్పు కోసం ఆసుపత్రి‌కి వచ్చిన శ్రావణి పరిస్థితి విషమంగా ఉండటంతో బంధువులు నెల్లూరుకు తరలించారు. నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. గూడూరు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భార్య చనిపోయిందంటూ శ్రావణి భర్త ఏమల హరి ఆందోళన వ్యక్తం చేశారు. బాలింత మృతదేహంతో బంధువులు, కుటుంబ సభ్యులు గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Madhusudhan Rao : AK 47గన్ తో కాల్చారు..  మధుసూధన్ రావు శరీరంలో 42 బుల్లెట్లు!

జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.  ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు శరీరంలో 42 బుల్లెట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. AK 47గన్ తో ఆయన్ను ఉగ్రవాదులు కాల్చినట్లుగా సమాచారం.

New Update

జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.  ఉగ్రదాడిలో మృతి చెందిన నెల్లూరు(nellore) జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు శరీరంలో 42 బుల్లెట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. AK 47గన్ తో ఆయన్ను ఉగ్రవాదులు కాల్చినట్లుగా సమాచారం. బెంగుళూరులో సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న మధుసూదన్ రావు హాలీడే ట్రిప్ కోసమని కుటుంబంతో కలిసి కశ్మీర్ వెళ్లి అక్కడ ఉగ్రవాదుల చేతిలో హతమయ్యాడు. మధుసూదన్ రావు తల్లిదండ్రులు ఇద్దరూ హార్ట్ పేషేంట్స్ కావడంతో ఇంకా అతను చనిపోయిన విషయాన్ని బంధువులు చెప్పలేదు.  

Also Read :  Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

Advertisment
Advertisment
Advertisment