NEET : నీట్ యూజీ ఎగ్జామ్.. ఎన్ని ప్రశ్నలుంటాయి..? నెగిటివ్ మార్కింగ్ ఎంత? నీట్ యూజీ పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటాయి. పరీక్ష వ్యవధి 3 గంటల 20 నిమిషాలు. ఇందులో మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు, తప్పు సమాధానానికి ఒక మార్కు కట్ చేస్తారు. పరీక్ష 720 మార్కులకు ఉంటుంది. By Trinath 13 Feb 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి NEET UG EXAM Pattern : దేశవ్యాప్తంగా మెడికల్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కోసం పెన్-పేపర్ ఆధారిత నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(NEET UG) మే 5, 2024న నిర్వహించనున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) NEET UG కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ విండోను తెరిచింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 9 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్ చేయవచ్చు. MBBS, BAMS, BUMS, BSMS కాకుండా, BHMS లో ప్రవేశం కూడా NEET UG మెరిట్ స్కోర్ ఆధారంగా జరుగుతుంది. 13 భారతీయ భాషలలో పరీక్ష: NEET UG 2024 పరీక్ష హిందీ, ఇంగ్లీషుతో సహా 13 భారతీయ భాషలలో నిర్వహించనున్నారు. పరీక్ష హిందీ, ఇంగ్లీష్, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, తమిళం, తెలుగు, ఒరియా, మలయాళం, కన్నడ, పంజాబీ, ఉర్దూ భాషలలో ఎగ్జామ్‌ను నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కింగ్: యూజీ పరీక్షను ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనే 3 విభాగాలుగా విభజించారు. పరీక్షా మాధ్యమం పెన్-పేపర్ ఆధారంగా అంటే ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటల 20 నిమిషాలు. ఇది మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 వరకు ఉంటుంది. ఇందులో మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. ఫిజిక్స్ విభాగంలో 35 అండ్ 15 ప్రశ్నలు (45 ప్రశ్నలు పరిష్కరించాల్సి ఉంటుంది), కెమిస్ట్రీ విభాగంలో 35 అండ్ 15 ప్రశ్నలు (45 ప్రశ్నలు పరిష్కరించాల్సి ఉంటుంది) ఉంటాయి. బయాలజీ-జువాలజీలో 35 అండ్ 15 ప్రశ్నలు, ప్లాంట్ సైన్స్‌లో 35 అండ్ 15 ప్రశ్నలు ఉంటాయి. ఈ రెండు సబ్జెక్టుల్లో 45-45 ప్రశ్నలను పరిష్కరించాల్సి ఉంటుంది. విద్యార్థులు ప్రతి సబ్జెక్టులోని-బి విభాగంలో 15 ప్రశ్నలకు 10 మాత్రమే రాయాలి. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు, తప్పు సమాధానానికి ఒక మార్కు కట్ చేస్తారు. పరీక్ష 720 మార్కులకు ఉంటుంది. Also Read : మరో నెలలో పెళ్లి..ఇంతలోనే మెడికో విద్యార్థిని ఆత్మహత్య! WATCH: #neet-ug-2024 #mbbs #bhms మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి