NEET PG Exam : నీట్ పీజీ పరీక్ష తేదీ ఖరారు.. ! ఎప్పుడంటే

ఆగస్టు 11న నీట్ పీజీ పరీక్ష జరగనుంది. రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు నేషనల్ బోర్డ్‌ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌ ఇన్ మెడికల్ సైన్సెస్‌ (NBEMS) ఉత్తర్వులు జారీ చేసింది. 

New Update
NEET PG Exam : నీట్ పీజీ పరీక్ష తేదీ ఖరారు.. ! ఎప్పుడంటే

NEET PG Exam Date Fixed : ఆగస్టు 11న నీట్ పీజీ పరీక్ష జరగనుంది. రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు నేషనల్ బోర్డ్‌ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌ ఇన్ మెడికల్ సైన్సెస్‌ (NBEMS) ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల నీట్‌ యూజీ పేపర్‌ లీక్ (NEET UG Paper Leak) కావడంతో వివాదాలు తలెత్తిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు, అరెస్టులు జరగడంతో ఈ ప్రభావం నీట్‌ పీజీ పరీక్షపై కూడా పడింది. దీంతో జూన్‌ 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది. చివరికి కేంద్రం.. ఈ పరీక్షను రీషెడ్యూల్ చేసి నిర్వహించేందుకు సిద్ధమైంది.

Also read: ప్రధాని మోదీతో పీవీ సింధు చిట్ చాట్

పోస్ట్‌ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతి ఏడాది నీట్ పీజీ పరీక్ష (NEET PG Exam) ను నిర్వహిస్తుంటారు. నీట్‌ యూజీ వివాదాల వల్ల పలు జాగ్రత్తలతో నీట్ పీజీ పరీక్షను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే నీట్ పీజీ క్వశ్చన్ పేపర్‌ను పరీక్షకు కేవలం రెండు గంటల ముందు మాత్రమే తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు