Telangana Kids missing : కనపడకుండా పోతున్న చిన్నారులు.. తెలంగాణలో రోజుకు ఎంతమంది పిల్లలు మిస్సింగ్ అంటే? గతేడాది(2022) 3,443 మంది పిల్లలు అదృశ్యమయ్యారని NCRB డేటా చెబుతోంది. 2022లో తప్పిపోయిన 391 మంది బాలికలతో సహా 654 మంది చిన్నారులు ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు. రాష్ట్రంలో ప్రతి రోజు సగటున దాదాపు 10 మంది పిల్లలు తప్పిపోతున్నారని నివేదిక చెబుతోంది. By Trinath 11 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి అప్పటివరకు ఇంట్లోనే కనిపించిన పిల్లలు ఒక్కసారిగా మాయమవుతున్నారు. ఇంటి బయట ఆడుకుంటూ కనిపించిన చిన్నారులు ఎలా అదృశ్యమవుతున్నారో అంతుచిక్కడం లేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) డేటా ప్రకారం తప్పిపోయిన పిల్లల సంఖ్యలో తెలంగాణ(Telangana) దేశవ్యాప్తంగా ఎనిమిదో స్థానంలో ఉంది. గతేడాది(2022) 3,443 మంది పిల్లలు అదృశ్యమయ్యారని NCRB డేటా చెబుతోంది. రికవరీ రేటు 87శాతం: 2022లో తప్పిపోయిన 391 మంది బాలికలతో సహా 654 మంది చిన్నారులు ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు. 3,588 మంది పిల్లలు ఆచూకీ లభ్యమైంది. రాష్ట్రంలో ప్రతి రోజు సగటున దాదాపు 10 మంది పిల్లలు తప్పిపోతున్నారని డేటా చెబుతోంది. గత మూడు సంవత్సరాలలో (2020-2022), తెలంగాణలో దాదాపు 10వేల మంది పిల్లలు తప్పిపోయారు. పిల్లలు తప్పిపోయినప్పుడు కేసు దాఖలు చేస్తే అది అపహరణ లేదా అక్రమ రవాణా కింద కేసులు బుక్ చేస్తున్నారు. CrPC సెక్షన్ 154 కింద నమోదు చేస్తారు. ఇలాంటి మిస్సింగ్ కేసుల కోసం పర్యవేక్షణ సెల్‌ను రాష్ట్రం ఏర్పాటు చేసింది. కేసులను పరిష్కరించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. తప్పిపోయిన పిల్లలను వారి కుటుంబాలతో తిరిగి కలపడానికి ప్రభుత్వాలు భరోసా ఇస్తున్నాయి. చాలా మంది పిల్లలను కొనుగోంటున్నాయి కానీ ఆచుకీ తెలియని వారు అక్రమ రవాణాకు బలైపోయారానన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అపహరణ లేదా కిడ్నాప్: మిస్ అవుతున్న వారిలో అపహరణ లేదా కిడ్నాప్ గురయ్యే వారు కూడా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 12-16 సంవత్సరాల వయస్సు గల వారిలో ఎక్కువ మంది ఇంటి నుంచి వెళ్లిపోయిన వారు కూడా ఉన్నారు. 3-7 సంవత్సరాల వయస్సు గల పిల్లలు అపహరణ లేదా కిడ్నాప్‌కు గురవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక పోలీసులు సైతం మిస్సింగ్ కేసులను శరవేగంగా పరిష్కారిస్తున్నారని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో మిస్సింగ్ కేసులపై అవగాహన ఎక్కువగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. Also Read: కవర్లకు కూడా డబ్బులు లేవా…వైరల్ అవుతున్న సునీల్ గవాస్కర్ కామెంట్స్ WATCH: #telangana #hyderabad #ncrb-report మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి