Sharad Pawar : రామమందిరం నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉంది కానీ..కేంద్రం నుంచి నాకు ఆహ్వానం అందలేదు..!!

అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రారంభోత్సవానికి తనకు కేంద్రం నుంచి ఆహ్వానం అందలేదన్నారు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం రామమందిరాన్ని ఉపయోగించుకుంటుందో లేదో చెప్పడం కష్టమన్నారు.

New Update
Ayodhya Ram Mandir : ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22నే ఎందుకు? ఈ తేదీ ప్రాముఖ్యత ఏంటి?

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందలేదన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం రామమందిరాన్ని ఉపయోగించుకుంటుందో లేదో చెప్పలేనన్నారు. ఏది ఏమైనా రామాలయం ఏర్పడినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. రామమందిర ప్రారంభోత్సవానికి శరద్ పవార్ దూరం కానున్నట్లు వార్తలు రాగా...ఈ విషయంపై స్పష్టతనిచ్చారు.

కాగా 2024 జనవరి 24న అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ప్రతిపక్షనేతలతో సహా ప్రముఖులకు కేంద్రం ఆహ్వానం పంపించింది. అయితే రామమందిర ప్రారంభోత్సవానికి శరద్ పవార్ దూరం కానున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. రామాలయ ప్రారంభోత్సవానికి మీరు వెళ్తున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పష్టత నిచ్చారు. ప్రారంభోత్సవానికి తనకు కేంద్రం నుంచి ఆహ్వానం అందలేదన్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

అయోధ్య రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు, అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ పురోగతిపై సమావేశంలో చర్చించారు. ఈ ముఖ్యమైన ప్రాజెక్టుల అభివృద్ధి గురించి రాష్ట్రపతికి తెలియజేయడమే సంభాషణ యొక్క ఉద్దేశ్యం.అయోధ్య రామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో పార్టీ నాయకుడు అధీర్ రంజన్ చౌదరిలను పవిత్రోత్సవానికి ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొంటారా లేదా అనే విషయంపై పార్టీ నుంచి సమాచారం లేదు.

శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ వేడుకలకు అన్ని వర్గాలకు చెందిన 4,000 మంది సాధువులను కూడా ఆహ్వానించింది. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం నుంచి 12.45 గంటల మధ్య గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ట్రస్ట్ నిర్ణయించింది. వేద పూజారి లక్ష్మీకాంత దీక్షిత్ ఆ రోజున ముడుపుల ప్రధాన క్రతువులను నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి: విజయ్ కాంత్ మన తెలుగోడే…ఆంధ్ర నుంచి వలస వెళ్లిన విజయ్ కాంత్ కుటుంబం..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు