Annapoorani Movie: నెట్‌ఫ్లిక్స్, జీ స్టూడియోస్‌ నుంచి ‘అన్నపూరణి’ సినిమా ఔట్.. కారణం ఇదే

నయనతారా హిరోయిన్‌గా నటించిన అన్నపూరాణి అనే చిత్రం హిందూ మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని పలు హిందూ గ్రూప్‌లు చిత్ర బృందంపై కేసు పెట్టాయి. ఈ చిత్రం వివాదస్పదం కావడంతో తాజాగా నెట్‌ఫ్లిక్స్‌, జీ స్టూడియోస్‌లు తమ ఫ్లాట్‌ఫాం నుంచి సినిమాను తొలగించాయి.

New Update
Annapoorani Movie: నెట్‌ఫ్లిక్స్, జీ స్టూడియోస్‌ నుంచి ‘అన్నపూరణి’ సినిమా ఔట్.. కారణం ఇదే

Annapoorani: కొలివుడ్ లేడీ సూపర్‌ స్టార్ నయనతారా (Nayanthara) హిరోయిన్‌గా నటించిన అన్నపూరాణి అనే చిత్రానికి కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రం హిందువుల మనోభావాలు కించపరిచేలా ఉందంటూ పలు హిందూ గ్రూప్‌లు ఈ సినిమాపై కేసు పెట్టాయి. డిసెంబర్ 29 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) స్ట్రీమింగ్‌ కాగా.. దీనిపై ఆరోపణలు రావడంతో తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ తన ప్లాట్‌ఫామ్‌ నుంచి ఈ సినిమాను తొలగించింది. నటులు నయనతారా, జై, దర్శకుడు నిలేష్ కృష్ణ, నిర్మాతలు జతిన్ సెతీ, రవీంద్రన్, పునిత్‌ గోయెంకాలపై ఇటీవల హిందూ ఐటీ సెల్‌ వ్యవస్థాపకుడు, శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి (Ramesh Solanki) కేసు పెట్టారు.

అలాగే జీ స్టూడియోస్ చీఫ్ బిజినెస్ అధికారి షారిక్ పటేల్, నెట్‌ఫ్లిక్స్ ఇండియా హెడ్‌ మోనికా షెర్గిల్‌లపై కూడా ఆయన కేసు నమోదు చేశారు. ఈ సినిమా రాముడిని కించపరిచేలా, ల‌వ్ జీహాద్‌ను ప్రోత్సహించేలా ఉందని వీళ్లపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరారు. ఈ చిత్రంపై వివాదం తలెత్తడంతో నెట్‌ఫ్లిక్స్ దీన్ని తొలగించగా.. జీ స్టూడియోస్‌ (Zee Studios) కూడా తన ఓటీటీ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచి ఈ చిత్రాన్ని డిలీట్ చేసింది. అయితే ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫాంల నుంచి తొలగించడాన్ని కొందరు సపోర్ట్‌ చేస్తుంటే.. మరికొంద‌రు వ్యతిరేకిస్తున్నారు.

Also Read: ప్రజాపాలన అప్లికేషన్ల పేరుతో మోసం.. ఓటీపీ చెప్పడంతో ఖాతా ఖాళీ!

కథ ఏంటంటే

అన్నపూరణి చిత్రం అనేది తాను అనుకున్నది సాధించే ఓ మహిళా కథ. శ్రీరంగం అనే ఓ సంప్రదాయ పట్టణంలో బ్రాహ్మణ కుటుంబంలో ఈమె జన్మిస్తుంది. చిన్నప్పటి నుంచి ఆమె తాను కలలు కన్న ఆశలు, సంప్రదాయ కట్టుబాట్ల మధ్య నలిగిపోతుంది. కుల, మత బేధాలను అడ్డుకొని చెఫ్‌గా ఎదగాలనే తన కలను ఎలా సాకారం చేసుకుంది అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో హిరోయిన్ బ్రాహ్మిణ్ (Brahmin) అయితే హిరో ముస్లీం. ఒక సన్నివేశంలో హిరో.. రాముడు కూడా మాంసాన్ని తిన్నాడని చెబుతూ హిరోయిన్‌ను మాంసం తినేలా చేస్తాడు. ఇక క్లైమాక్స్‌లో వంటల పోటీల్లో చివరి రౌండ్‌ జరుగుతుంది. ఈ రౌండ్‌లో హిరోయిన్‌ బిర్యానీ తయారు చేస్తుంది. అంతకుముందు హిజాబ్‌ను ధరించి, నమాజ్‌ కూడా చేస్తుంది.

ఇలాంటి సన్నివేశాలు ఉండటంతో ఈ చిత్రం హిందువుల (Hindus) మనోభావాలు కించపరిచేలా, లవ్‌ జిహాదీని ప్రోత్సహించేలా ఉందంటూ చిత్ర బృందంపై, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లపై కేసు నమోదైంది. ఇక ఈ సినిమా వివాదస్పదం కావడంతో.. నెట్‌ఫ్లిక్స్, జీ స్టూడియోస్ తమ ఓటీటీ ప్లాట్‌ఫాంల నుంచి చిత్రాన్ని తొలగించాయి. మత విశ్వాసాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని చిత్ర నిర్మాణ సంస్థ కూడా వివరణ ఇచ్చింది. తమ సినిమా ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని కోరింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం తాజాగా మరో కొత్త ఓటీటీని వెతుక్కుంది. సాత్ ఇండియ‌న్ సినిమాల‌కు చెందిన ప్రముఖ ఓటీటీ దిగ్గజం సింప్లీ సౌత్‌లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియాలో ప్రకటించింది.

Also Read: కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి.. కిషన్ రెడ్డి హెచ్చరికలు

Advertisment