/rtv/media/media_files/2025/03/27/ozwLhGG0dw8qiuXLGy68.jpg)
Char Dham Yatra Photograph: (Char Dham Yatra)
ఇండియాలో చార్‌ధామ్ యాత్ర ఎంతో ప్రసిద్ధి చెందింది. కేవలం వేసవిలో మాత్రమే ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను దర్శించుకోడానికి వీలు ఉంటుంది. ఎంతో ప్రసిస్ధి చెందిన చార్‌ధామ్ యాత్ర ఏప్రిల్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు అన్నీ ఏర్పాటు చేయనున్నారు. ఈసారి చార్ ధామ్ యాత్ర సందర్భంగా ఆలయ ప్రాంగణంలో యూట్యూబర్లు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్‌పై కఠినమైన నిషేధం ఉంటుంది. కేదార్‌నాథ్- బద్రీనాథ్ పాండా సమాజ్ ఆలయ ప్రాంగణంలో వీడియోలు తీసే వారిపై కఠినంగా వ్యవహరించనున్నారు.
Also read: OLA, UBERకు చెక్.. కేంద్రం నుంచి కొత్త యాప్.. అమిత్ షా సంచలన ప్రకటన!
రీల్స్ లేదా యూట్యూబ్ వీడియోలు తీస్తూ ఎవరైనా దొరికితే వారిని ఆలయ ప్రాంగణం నుంచి తిరిగి పంపిస్తామని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త నిబంధనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కూడా జరిగాయి. ఏప్రిల్ 30 నుంచి గంగోత్రి, యమునోత్రి ఆలయ తలుపులు తెరవడంతో యాత్ర ప్రారంభమవుతుంది. మే 2న కేదార్‌నాథ్ దర్శణం చేసుకోవచ్చు. ఆ తర్వాత మే 4న బద్రీనాథ్ తలుపులు తెరవబడతాయి. ఇది చార్ ధామ్ యాత్ర యొక్క పూర్తి స్థాయి ప్రారంభాన్ని సూచిస్తుంది.
Also read: Google: గుట్టుచప్పుడు కాకుండా గూగుల్ మీ ప్రతీ మాట వింటోంది.. ఇలా చెక్ పెట్టిండి!
హరిద్వార్, రిషికేశ్, బ్యాసి, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్‌ప్రయాగ్, హెర్బర్ట్‌పూర్, వికాస్‌నగర్, బార్కోట్, భట్వారీలలో 10 హోల్డింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతాలు నీరు, మరుగుదొడ్లు, విశ్రాంతికి, అత్యవసర ఆహార సామాగ్రి, ఔషదాల వంటి అవసరమైన సౌకర్యాలను దొరుకుతాయి. మొత్తం యాత్ర మార్గాన్ని 10 కిలోమీటర్ల సెక్టార్‌లుగా డివైడ్ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు సహాయం చేయడానికి మోటార్‌సైకిళ్లపై ఆరుగురు పోలీసు సిబ్బంది ప్రతి సెక్టార్‌లో గస్తీ తిరుగుతారు. ఇప్పటివరకు 9 లక్షల మందికి పైగా భక్తులు ఆన్‌లైన్‌లో చార్‌ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. అత్యధికంగా 2.75 లక్షలు కేదార్‌నాథ్‌కు, తరువాత బద్రీనాథ్ 2.24 లక్షలు, గంగోత్రి 1.38 లక్షలు, యమునోత్రి 1.34 లక్షలు మరియు హేమకుండ్ సాహిబ్ 8వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి.