/rtv/media/media_files/2026/06/04/wipro-2026-06-04-20-44-44.jpg)
ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ విప్రో పూణేలోని హింజేవాడి క్యాంపస్‌లో మత మార్పిడి సెగలు రేగుతున్నాయి. అక్కడ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేసిన ఒక మహిళా ఉద్యోగిని, తనపై ఉన్న లేడీ బాస్ మతపరమైన వేధింపులకు గురిచేసిందని, బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నించిందని ఆరోపిస్తూ పూణే పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. బెంగళూరులో ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సదరు మహిళా బాస్‌పై ఈ కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై స్పందించిన విప్రో సంస్థ, తాము పోలీసు దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని, అవసరమైన అన్ని రికార్డులను పూణే పోలీసులకు అందజేశామని ప్రకటించింది.
ANOTHER IT INDUSTRY SHOCKER AFTER TCS!
— Treeni (@treeni) June 3, 2026
NOW: Female Hindu Ex Wipro employee alleges colleague Shahina Rafique pressured her to convert to Islam and establish physical relations with the Country Head.
When she complained, she was threatened by HR Manager Zeeshan Ahmed and forced… pic.twitter.com/gYrjBCzvGI
బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. పూణే ఆఫీస్‌లో పనిచేస్తున్న సమయంలో కొందరు సీనియర్ మేనేజర్లు, టీమ్ లీడర్లు ఆమె మతాన్ని టార్గెట్ చేస్తూ మానసిక ఒత్తిడికి గురిచేశారు. ఇస్లాం మతాన్ని స్వీకరించాలని, ఆ మత పద్ధతులను పాటించాలని పదే పదే బలవంతం చేశారు. అలా చేస్తే విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయని, జీవితం బాగుంటుందని ప్రలోభపెట్టారు. ఒక ముస్లిం వ్యక్తితో సంబంధం పెట్టుకోవాలంటూ కూడా ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించారు.
ఈ విషయంపై సీనియర్ పోలీస్ అధికారి బాలాజీ పంధారే మాట్లాడుతూ.. విప్రో మహిళా ఉద్యోగిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హింజేవాడి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. ఇన్సూరెన్స్ విభాగంలో పనిచేసే ఆమె లేడీ బాస్ కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి, బలవంతంగా రాజీనామా చేయించినట్లు ప్రాథమికంగా తెలిసిందని, దీనిపై కంపెనీ గతంలో ఎలాంటి చర్యలు తీసుకుందో కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. కాగా, 'హిందూ జనజాగృతి సమితి' బుధవారం పూణేలో ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బాధిత మహిళ హాజరై, 2019 నుండి 2025 వరకు విప్రోలో తను ఎదుర్కొన్న నరకాన్ని మీడియా ముందు వివరించారు.
విప్రో అధికారిక ప్రకటన
ఈ వివాదంపై విప్రో సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. "మా కంపెనీలో ఉద్యోగుల సంక్షేమం, గౌరవ మర్యాదలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాము. ఎలాంటి వివక్ష, వేధింపులు లేదా ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులను కాలరాసే చర్యలను మేము అస్సలు సహించబోము. ఈ కేసులో పూణే పోలీసులకు మేము పూర్తి స్థాయిలో సహకరిస్తున్నాము. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నందున కేసు లోపలి వివరాలపై మేము ఇప్పుడే వ్యాఖ్యానించలేము. అందరికీ సురక్షితమైన, సమానత్వంతో కూడిన పని వాతావరణాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని విప్రో స్పష్టం చేసింది.
Follow Us