/rtv/media/media_files/2025/01/08/osC4UH8BrFhSso02sEvV.jpg)
rajeev
Delhi: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కోసం మంగళవారం ప్రెస్‌మీట్ నిర్వహించిన సీఈసీ రాజీవ్ కుమార్.. ఎన్నికల తేదీలు, షెడ్యూల్ వివరాలు ప్రకటించారు. ఈ క్రమంలోనే తన పదవీ విరమణ గురించి కూడా ఆయన తాజాగా స్పందించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన పదవీ కాలం పూర్తి కానున్నట్లు చెప్పారు.
Also Read: USA: అమెరికాలో కెనడా విలీనం..అందుకే ట్రుడో రాజీనామా అంటున్న ట్రంప్
కొన్ని నెలల పాటు..
అయితే పదవి విరమణ తర్వాత ఏవైనా ప్రణాళికలు సిద్దం చేసుకున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన అదిరిపోయే సమాధానం ఇచ్చారు. తాను ఈ పదవి నుంచి రిటైర్ అయిన తర్వాత కొన్ని నెలల పాటు హిమాలయాలకు వెళ్లి అక్కడే ఉంటానని చెప్పి అందర్ని ఆశ్చర్యపరిచారు.ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత.. ఫిబ్రవరి 18వ తేదీన తాను పదవీ విరమణ చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.
Also Read: America: దారుణం..విమానం ల్యాండింగ్ గేర్ లో శవాలు..అసలు ఎలా వచ్చాయి?
రిటైర్మెంట్ తర్వాతహిమాలయాలకు వెళ్లి తాను డీటాక్సీఫై అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తనకు కొంచెం ఏకాంత సమయం కావాలన్నారు. అందుకోసం అందరికీ దూరంగా వెళ్తానని చెప్పారు. హిమాలయాల్లో సుదూర ప్రాంతానికి వెళ్లి అక్కడే 4, 5 నెలల పాటు అక్కడే ఉంటానని పేర్కొన్నారు. అనవసర అంశాల నుంచి పూర్తి విముక్తి పొందుతానని రాజీవ్ కుమార్ వెల్లడించారు.
ఈ సందర్భంగా తన చిన్ననాటి వ్యక్తిగత విషయాలను కూడా మీడియాతో రాజీవ్ చెప్పారు. తాను ఒక మున్సిపల్ స్కూల్లో చదువుకున్నానని వివరించారు. చిన్నతనంలో తాను చెట్టు కింద విద్యా బోధనలు విన్న రోజులను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. ఇక తాను ఏ, బీ, సీ, డీలను ఆయన ఆరో తరగతిలో నేర్చుకున్నట్లు చెప్పారు. అందుకే అణగారిన వర్గాల చిన్నారులకు బోధించడం తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పారు.
Also Read: Sheikh Hasina: బంగ్లా మాజీ ప్రధాని షేక్ హాసినా పాస్‌పోర్టు రద్దు!
Also Read: Canada: కెనడా నెక్ట్స్ పీఎం ఎవరు..రేసులో భారత సంతతి ఎంపీ కూడా!
Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.
Mohan Bhagwat
జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే.
Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్ ఫిక్స్..! పాక్ మాజీ హైకమిషనర్ సంచలన కామెంట్స్
ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.
Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..
అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు.
Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్ గాంధీ
Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!
mohan-bhagwat | attack in Pahalgam
Russia-Ukrain-Putin: ఉక్రెయిన్ తో చర్చల పునరుద్దరణకు రెడీ..!
Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
భర్త మెచ్చిన అర్ధాంగిలో ఉండాల్సిన లక్షణాలివే!
🔴India - Pakistan War Live Updates: ఏ క్షణమైనా భారత్ -పాకిస్థాన్ యుద్ధం లైవ్ అప్డేట్స్!
Omar Abdullah: పాక్ ప్రధానిపై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు