/rtv/media/media_files/2025/02/15/F4VWKCyBnXpDX1EZMIan.jpg)
ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగించుకుని భారత్ కు చేరుకున్నారు. సీఎం అభ్యర్థిని త్వరలోనే ఖరారు చేయనున్నారు. ఫిబ్రవరి 19 లేదా 20న ఢిల్లీలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉందని ఢిల్లీ బీజేపీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 17 లేదా 18 తేదీల్లో బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరిగే అవకాశం ఉంది. 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలలో 15 మంది పేర్లు షార్ట్ లిస్టు చేశారు. ఇందులో 9 మంది పేర్లను మళ్లీ షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరిలో నుంచే ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్ పేర్లను నిర్ణయిస్తారు. రేఖ గుప్తా, ప్రవేశ్ వర్మ, మోహన్ సింగ్ బిష్ట్, విజేంద్ర గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్, ఆశిష్ సూద్, శిఖా రాయ్, పవన్ శర్మ పేర్లు సీఎం, మంత్రుల లిస్టులో ఉన్నాయని తెలుస్తోంది.
సీఎం, మంత్రుల లిస్టు
1- రేఖ గుప్తా- ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుండి వచ్చిన ఈమె షాలిమార్ బాగ్ స్థానం నుండి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, ఆమె ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో మూడుసార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు.
2- శిఖా రాయ్- గ్రేటర్ కైలాష్‌లో మూడుసార్లు ఎమ్మెల్యే, ఢిల్లీ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్‌ను ఈ ఎన్నికల్లో ఓడించారు.
3- ప్రవేశ్ వర్మ- న్యూఢిల్లీ స్థానం నుండి కేజ్రీవాల్‌ను ఓడించిన తర్వాత ఈయన ఎక్కువగా వార్తల్లో నిలిచారు, ఈయన రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎంపీగా ఉన్నారు. ఈయన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు.
4. మోహన్ సింగ్ బిష్ట్- ఈయన పహారీ రాజ్‌పుత్ నుంచి 6 సార్లు ఎమ్మెల్యే, విద్యార్థి దశలోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు.
5- విజేందర్ గుప్తా- ఈయన వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యే, ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.
6- సతీష్ ఉపాధ్యాయ్- బ్రాహ్మణ వర్గానికి చెందిన నేత. మాలవీయ నగర్ నుంచి మూడుసార్లు ఆప్ ఎమ్మెల్యేగా ఎన్నికైన సోమనాథ్ భారతిని ఓడించి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
7- ఆశిష్ సూద్- మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు - గోవాలో బీజేపీ ఇన్‌చార్జ్. ఈయన జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ సహ-ఛార్జ్‌గా కూడా ఉన్నారు.
8- పవన్ శర్మ- ఉత్తమ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికైన ఎమ్మెల్యే. ఆప్ అభ్యర్థి పోష్ బాల్యాన్‌ను ఈ ఎన్నికల్లో ఓడించారు. ఈయన మూడోసారి ఎమ్మెల్యే
Also Read : RCB vs GG : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీ శుభారంభం