మొబైల్‌లో పో*ర్న్‌ చూస్తే జైలుకే.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

చైల్డ్ పోర్నోగ్రఫీ ఏ పరిస్థితుల్లో, ఏ రూపంలో ఉన్నా సరే నేరమేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆ వీడియోలు చూసినా, లేక డౌన్ లోడ్ చేసుకున్నా, లేక షేర్ చేసినా.. పోక్సో చట్టం వర్తిస్తుందని తేల్చి చెప్పింది

author-image
By Bhavana
New Update
supreme

Supreme Court : చైల్డ్ పోర్నోగ్రఫీ ఏ పరిస్థితుల్లో, ఏ రూపంలో ఉన్నా సరే నేరమేనని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆ వీడియోలు చూసినా, లేక డౌన్ లోడ్ చేసుకున్నా, లేక షేర్ చేసినా.. పోక్సో చట్టం వర్తిస్తుందని తేల్చి చెప్పింది. న్యాయస్థానాలు చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదమే వాడకూడదని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. ఈమేరకు మద్రాసు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 

చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్ లోడ్ చేసుకున్నాడనే ఆరోపణలపై 28 ఏళ్ల యువకుడిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. కింది కోర్టు శిక్ష ఖరారు చేయడంతో ఆ యువకుడు మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ తర్వాత హైకోర్టు తీర్పు చెబుతూ.. వీడియోలు డౌన్ లోడ్ చేసుకున్నప్పటికీ ఆ యువకుడు వాటిని ఎవరికీ షేర్ చేయలేదని, ఎవరినీ వేధించలేదని పేర్కొంటూ సదరు యువకుడిపై క్రిమినల్ చర్యలు నిలిపివేయాలని మద్రాసు హైకోర్టు ఈ ఏడాది జనవరిలో తీర్పు చెప్పింది. 

ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్ దాఖలు చేశారు. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ పిటిషన్లను సోమవారం విచారణ జరిపింది. మద్రాసు హైకోర్టు తీర్పును ఈ బెంచ్ తప్పుబట్టింది. చైల్డ్ పోర్నోగ్రఫీ ఏ రకంగా ఉన్నప్పటికీ అది పోక్సో చట్టం కింద నేరమే అని తీర్పునిచ్చింది.

Also Read :  మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024 గా గుజరాతీ బొమ్మ!

Advertisment
Advertisment
తాజా కథనాలు