/rtv/media/media_files/2025/03/01/T8c3c6jIp1fedxLQglnB.jpg)
Petrol stations closing down
War effect on Hyderabad : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నగరంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నగరంలో ఇప్పటికే గ్యాస్ దొరకక హోటల్స్, హాస్టల్స్ మూతపడుతుండగా తాజాగా పెట్రోల్ కూడా దొరకకపోవడంతో హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నగరంలో గ్యాస్ కష్టాలు మొదలై నానా ఇబ్బందులు పడుతుండగా, పెట్రోల్, డిజీల్, ఆటోలకు వినియోగించే సీఎన్‌జీ గ్యాస్ దొరకకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నరు. యుద్ధం కారణంగా చమురు దిగుమతులు నిలిచిపోవడంతో నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిండుకున్నది. దీంతో ఆయా పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి.
గడచిన నెల రోజులుగా యుద్ధం కొనసాగుతుండటంతో హర్మూజ్ జలసంధి నుంచి ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో తాజాగా పెట్రోలియం కంపెనీలు డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా చేయలేక మూతబడుతున్నాయి. నగరంలోని పలుపెట్రోల్ బంకులు స్టాక్ లేకపోవడంతో మూతపడుతున్నాయి. అదే విధంగా గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో పలు హోటల్స్ మూతపడ్డాయి. కొన్ని టిఫిన్స్ సెంటర్లు ధరలు పెంచి టిఫిన్లు విక్రయిస్తున్నాయి. గ్యాస్ లేకపోవడంతో సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ మహాకాళి దేవస్థానంలో ప్రతిరోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఇక పలు గ్యాస్ ఎజేస్సీలు సైతం నో స్టాక్ బోర్టులు ఏర్పాటు చేశాయి.
నిన్నటి నుంచి నగరంలో పెట్రోల్ దొరకడం లేదని పుకార్లు షికారు చేయడంతో వాహనదారులు పెట్రోల్ బంక్‌ల వద్ద క్యూ కడుతున్నారు. పలు పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేకపోవడంతో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. దీంతో-- పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు ఎగబడుతున్నారు పలు బంకుల వద్ద కి.మీ మేర ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు-- పెట్రోల్ స్టాక్ సరిపడా ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తున్నారు.నిన్న పార్లమెంట్‌లో యుద్ధ తీవ్రతను ప్రధాని వివరించారు. కరోనా తరహా సంక్షోభ పరిస్థితి మళ్లీ వచ్చిందని ఆయన అన్నారు. ప్రధాని చెప్పిన గంటకే సిటీ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెట్టడం గమనార్హం.-- తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా ఇదే పరిస్థితి నెలకొనడంతో వినియోగదారులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించకపోవడంతో లాక్ డౌన్ నాటి పరిస్థితులు వస్తాయా అని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ దొరకకపోవడంతో పలువురు ఇబ్బందులు పడుతున్నారు. వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇండియన్ ఆయిల్ సంస్థ సంబంధించిన అన్ని పెట్రోల్ బంకుల వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచినట్లుగా తెలిపింది. వెబ్‌సైట్ https://locator.iocl.com/location/telangana/hyderabad ఓపెన్ చేసి, మీ ఏరియా క్లిక్ చేస్తే, పెట్రోల్ బంక్ ఫోన్ నెంబర్, ఓపెన్, క్లోజ్ వివరాలు, 24 అవర్స్ బంకుల వివరాలు అందుబాటులో ఉండనున్నాయని సూచించింది.
Follow Us