/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Air-India-Vistara-jpg.webp)
Vistara Flights:
తెలుపు, పర్పుల్ కలర్ విమానాలతో ఇంత కాలం ప్రయాణికలకు సేవలందిచిన విస్తారా ఫ్లైట్స ఇక మీద కనిపించవు. టాటా గ్రూప్ (51%), సింగపూర్ ఎయిర్‌లైన్స్ (49%) సంయుక్తంగా నడిపిన సంస్థే విస్తారా. 2015 దీనిని ప్రారంభించారు. కానీ ఇప్పుడు పదేళ్ళ తర్వాత ఇప్పుడు విస్తారాను.. టాటా గ్రూపుకే చెందిన మరో పెద్ద ఎయిర్ కంపెనీ ఎయిరిండియాతో విలీనం చేస్తున్నారు. విలీనం తర్వాత కూడా ఇందులో సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంస్థకు 25.1 శాతం వాటా ఉండబోతోంది. ఎయిరిండియాలో విస్తారా విలీనం తరవాత మరో రూ.3,195 కోట్లను సింగపూర్ ఎయిర్‌లైన్స్ పెట్టుబడిగా పెట్టనుంది.
Also Read: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు!
చివరి ఫ్లైట్..
విస్తారా ఫ్లైట్ మొదట ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళందో చివరి ఫ్లైట్ కూడా అదే రూట్‌లో ప్రయాణించనుంది. విస్తారాకు చెందిన యూకే 986 విమానం ముంబయి నుంచి ఢిల్లీకి నిన్న రాత్రి 10.50 గంటలకు బయల్దేరి వెళ్ళంది. దీంతోపాటు ఢిల్లీ నుంచి సింగపూర్‌కు వెళ్లాల్సిన యూకే 115 విమానం కూడా రాత్రి 11.45 గంటలకు వెళ్ళింది. సరిగ్గా పదేళ్ళ క్రితం 2015లో జనవరి 9న ప్రారంభమైన విస్తారా తన విమానం సర్వీసును ఢిల్లీ- ముంబయి మధ్యే నడిపారు. ఇప్పుడు ఇవాల్టి నుంచి విస్తారా విమానాలో కోడ్ ‘యూకే’ తెరమరుగై.. ఆ స్థానంలో ఏఐ2XXXX పేరుతో కొత్త కోడ్ వస్తుంది.
Also Read: నాకేం తెలియదు..ఆయనే నన్ను ఇరికించారు– హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్
విస్తారాకు గుడ్ బై చెప్పిన ప్యాసింజెర్స్...
పదేళ్ళు తన సేవలను అందించిన విస్తారాకు ప్రయాణికులు చివరి రోజు ఆ సంస్థకు గ్రాండ్ గా వీడ్కోలు పలికారు. సోషల్ మీడియాలో గుడ్ బై చెబుతూ పోస్టులు పెట్టారు. భారత దేశానికి అత్యంత ఇష్టమైన క్యారియర్లలో ఒకటైన విస్తారాకు కృతజ్ణతలు తెలిపారు. దాంతో పాటూ విస్తారాతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. వారి ప్రయాణ అనుభవాలలో మర్చిపోలేని విషయాలను గుర్తు చేస్తూ.. వారి చివరి ఫ్లైట్ ఫొటోలు , జ్ఞాపకాలు షేర్ చేశారు.
So Long Vistara and thank you for all the pictures..
— Pratik Mehta (@tweetpratikm) November 11, 2024
Here is a collection of my photographs from the last 5 years… (Part 1)
It’s been a great ride.. onwards and upwards to the next chapter with Air India #vistara #airbus #a320Neo #a321Neo #b7879 #lifeontheramp pic.twitter.com/ZSKml6N4SN
My last flight on @AirVistara was to Paris where the flight landed next to an @AirIndia plane under a beautiful sunset
— Tarun Shukla (@shukla_tarun) November 11, 2024
Great flight thoughtful crew
Sad to say farewell Vistara now, hopefully AI inflight 📺 Vista will continue to remind passengers of this lovely brand 👏👏👍
✈️ pic.twitter.com/uiRCIMTo3o
Also Read: వాయనాడ్‌ను ఉత్తమ పర్యాటక కేంద్రంగా మార్చాలి–ప్రియాంకతో రాహుల్ గాంధీ
Also Read: జొమాటోలో కొత్త ఫీచర్..సగం ధరకే ఫుడ్