ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్‌లో స్పెషల్.. అంతరిక్షంలో పోలింగ్ బూత్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వికాస్‌పురిలో వెరైటీ థీమ్‌లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. చంద్రయాన్ సే చునావ్ తక్ భారత్ కీ ఉడాన్ అనే థీమ్‌తో ప్రత్యేకమైన పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. అంతరిక్షం రంగంలో భారత్ సాధించిన విజయాల గురించి తెలిపే విధంగా బూత్‌లో పెట్టారు.

New Update
vikaspuri poling booth

vikaspuri poling booth Photograph: (vikaspuri poling booth)

దేశరాజధాని ఢిల్లీలో బుధవారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరింగింది. ఓటింగ్‌లో ఓ ప్రత్యేక ఆకర్షణగా పోలింగ్ బూత్ నిలిచింది. అంతరిక్షం థీమ్‌తో పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేశారు. స్పేస్ సెంటల్‌లోకి వెళ్లి ఓటేసిన అనుభూతి కలిగేలా అక్కడ ఏర్పాటు చేశారు. స్పేస్ సూట్‌ ధరించి వాలంటీర్లు ఓటర్లకు సేవలందించారు.

ఢిల్లీలోని వికాస్‌పురిలో చంద్రయాన్ సే చునావ్ తక్ భారత్ కీ ఉడాన్ అనే థీమ్‌తో ప్రత్యేకమైన పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. గతకొన్నిఏళ్లుగా అంతరిక్షం రంగంలో భారత్ సాధించిన విజయాలకు సంబంధించిన ప్రాజెక్ట్ మోడల్స్‌ను పోలింగ్ బూత్‌లో పెట్టారు. 

Also Read: Delhi: ఢిల్లీ ఎన్నికల పోలింగ్  షురూ..కేజ్రీవాల్ పై హర్యానాలో ఎఫ్ ఐఆర్

అలాగే ఈ పోలింగ్‌ బూత్‌ వద్ద ఏర్పాటు చేసిన టెలిస్కోప్‌లు, బయోస్కోప్‌లతో ఓటర్లు అద్భుతమైన అనుభవం, ఆనందం పొందారు. ప్రత్యేకమైన ఈ పోలింగ్‌ బూత్‌కు సంబంధించిన వీడియో క్లిప్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. వ్యోమగాముల మాదిరిగా డ్రెస్‌ ధరించిన వాలంటీర్లు ఇక్కడకు వచ్చిన ఓటర్లకు సేవలందించారు. పూలు ఇచ్చి ఓటర్లకు స్వాగతం పలికారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు