/rtv/media/media_files/2026/05/04/vijay-driver-son-2026-05-04-13-50-38.jpg)
Tamil Nadu Elections 2026:తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో TVK చీఫ్, దళపతి విజయ్(tvk vijay) తన మాజీ కారు డ్రైవర్ కొడుకును ఎన్నికల బరిలో నిలబెట్టగా, అక్కడ ఆ యువకుడు భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నాడు. తమిళనాడులోని విరుగంబాక్కం నియోజకవర్గంలో TVK తరపున పోటీ చేసిన శబరినాథన్ అనే యువకుడు తన ప్రత్యర్థిపై 5,000 ఓట్ల కంటే ఎక్కువ మెజారిటీతో ముందంజలో ఉన్నాడు.
Also Read : తమిళనాడు సీఎంగా విజయ్.. ప్రభుత్వ ఏర్పాటుకు మూడు దారులు
Vijay's Ex-Car Driver's Son Leads In Virugampakkam
శబరినాథన్ మరెవరో కాదు.. విజయ్ దగ్గర గతంలో కారు డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి కుమారుడు. ఒక సామాన్య కుటుంబానికి చెందిన యువకుడిని విజయ్ నమ్మి టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెడుతూ శబరినాథన్ గెలుపు దిశగా దూసుకుపోతున్నాడు. ఇక్కడ అధికార డీఎంకే అభ్యర్థి వెనుకంజలో ఉన్నారు. ఒక సామాన్యుడు అంతటి పెద్ద పార్టీ అభ్యర్థిని ఓడించబోతుండటం విశేషం. శబరినాథన్ తన నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. యువత ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు పలికారు.
అభ్యర్థుల పరిచయ సభలో విజయ్ తన పేరును ప్రకటించగానే శబరినాథన్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనై స్టేజ్ పైనే ఏడ్చేశారు. అది చూసిన విజయ్ వెంటనే దగ్గరకు వెళ్లి, ఆయన కన్నీళ్లు తుడిచి, హత్తుకుని ఓదార్చారు. శబరినాథన్ తండ్రి రాజేంద్రన్ విజయ్ దగ్గర దాదాపు 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు. మొదట డ్రైవర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి, ప్రస్తుతం విజయ్ కి పర్సనల్ అసిస్టెంట్ (PA) గా వ్యవహరిస్తున్నారు. చిన్నప్పటి నుంచి విజయ్ కళ్ల ముందే పెరిగిన శబరినాథన్, నేడు ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడటంతో ఆ తండ్రీకొడుకులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
Also Read : తమిళనాడు ఎన్నికలు... ట్రెండింగ్‌లో జననాయగన్ డైలాగులు.. త్రిష బర్త్‌డే
Follow Us