/rtv/media/media_files/2026/05/09/fotojet-2026-05-09-18-16-44.jpg)
Tamil Nadu Governor
BIG BREAKING: తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసుకున్నారు. ద్రవిడ రాజకీయాల కోటలో సరికొత్త చరిత్ర లిఖించబడింది. దశాబ్దాలుగా సాగుతున్న డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK) ద్వంద్వ ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ.. అరంగేట్రంలోనే రికార్డు స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్న తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, నటుడు తిరు సి. జోసెఫ్ విజయ్ తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. గత కొన్ని రోజులుగా సాగిన తీవ్ర రాజకీయ సస్పెన్స్, ఉత్కంఠకు తెరదించుతూ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నుంచి విజయ్‌కు అధికారికంగా పిలుపు అందింది.
/filters:format(webp)/rtv/media/media_files/2026/05/09/whatsapp-2026-05-09-21-16-12.jpeg)
లోక్‌భవన్‌లో కీలక భేటీ.. క్లియర్ చేసిన గవర్నర్
ఈ రోజు (మే 9, 2026) సాయంత్రం చెన్నైలోని లోక్‌భవన్ (రాజ్ భవన్)లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను విజయ్ తన మద్దతుదారులైన నేతలతో పాటు కలుసుకున్నారు. కూటమి పార్టీల నుంచి అందిన అధికారిక మద్దతు లేఖలను గవర్నర్‌కు సమర్పించి, ప్రభుత్వం ఏర్పాటుకు హక్కును ప్రకటించారు. సంఖ్యాబలంపై పూర్తి స్పష్టత రావడంతో గవర్నర్ అర్లేకర్ సంతృప్తి వ్యక్తం చేస్తూ, విజయ్‌ను తమిళనాడు ముఖ్యమంత్రిగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. మే 10, 2026 (ఆదివారం) ఉదయం 10 గంటలకు చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకు పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులతో పాటు లక్షలాది మంది అభిమానులు, టీవీకే కార్యకర్తలు తరలిరానున్నారు. విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే వార్త తెలియడంతో చెన్నై నగరవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.
అయితే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సాధించనప్పటికీ చివరి నిమిషం వరకు గవర్నర్ పలు కారణాలు చెప్పి ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం ఏర్పాటుకు అంగీకరించినప్పటికీ ఇదే సందర్భంలో మరోసారి మెలిక పెట్టడం సర్వత్రా చర్చనీయంశంగా మారింది. ముఖ్యమంత్రిగా నియమితులైన విజయ్.. రాబోయే మే 13, 2026 లోపు లేదా అంతకంటే ముందే తమిళనాడు అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని (విశ్వాస తీర్మానం పొందాలని) గవర్నర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
Follow Us