/rtv/media/media_files/2026/05/10/fotojet-2026-05-10-10-29-26.jpg)
Vijay takes oath as Chief Minister
Chief Minister : తమిళనాడు రాజకీయ చరిత్రలో ఆదివారం (మే 10, 2026) ఒక సరికొత్త సువర్ణ అధ్యాయం లిఖించబడింది. తమిళ చిత్ర పరిశ్రమలో 'దళపతి'గా కోట్లాది మంది గుండెల్లో నిలిచిన సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత సి. జోసెఫ్ విజయ్.. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో కన్నులపండువగా జరిగిన ఈ వేడుకలో రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తద్వారా ద్రవిడ రాజకీయాల కోటలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ విజయ్ తమిళనాడు పీఠాన్ని అధిరోహించారు.
జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జనసంద్రం..
ప్రమాణ స్వీకార వేడుకకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికైంది. తెల్లటి షర్ట్, పంచె ధరించి క్లీన్ లుక్‌లో స్టేడియానికి చేరుకున్న విజయ్‌కు అభిమానులు, పార్టీ శ్రేణులు 'వీర లెవెల్'లో స్వాగతం పలికారు. స్టేడియం మొత్తం 'దళపతి' నినాదాలతో హోరెత్తిపోయింది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా విచ్చేశారు. విజయ్‌తో హ్యాండ్‌షేక్ ఇచ్చి ఆయనకు అభినందనలు తెలిపారు.
ప్రత్యేక ఆకర్షణగా త్రిష
ఈ వేడుకలో స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన తల్లి హేమతో కలిసి నీలి రంగు చీర, తలలో మల్లెపూలు పెట్టుకుని సంప్రదాయబద్ధంగా ఆమె ఈ వేడుకకు హాజరయ్యారు. ఇటీవలి కాలంలో విజయ్, త్రిషల వ్యక్తిగత జీవితంపై సామాజిక మాధ్యమాల్లో అనేక ప్రచారాలు జరిగిన నేపథ్యంలో.. విజయ్ అత్యున్నత రాజకీయ వేదికపై త్రిష ప్రత్యక్షమవడం తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది.
కొత్త మంత్రివర్గం - శాఖల కేటాయింపు
ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికంటే ముందే విజయ్ తన సహచర మంత్రులకు శాఖలను కేటాయించి తన పరిపాలనా దక్షతను, స్పష్టతను చాటుకున్నారు. విజయ్‌తో పాటు మొత్తం 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఏడుగురు టీవీకే ఎమ్మెల్యేలు కాగా, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.ముఖ్యమంత్రి విజయ్ అత్యంత కీలకమైన హోం (రక్షక), ప్రజాపాలన శాఖలను తన వద్దే ఉంచుకున్నారు.
మిగిలిన మంత్రుల శాఖల వివరాలు:
మంత్రి పేరు కేటాయించిన శాఖ
జోసెఫ్ విజయ్ (CM)హోం, ప్రజాపాలన శాఖలు
ఆధవ అర్జున్ క్రీడలు, ఎక్సైజ్ శాఖ
కె.ఎ. సెంగొట్టాయన్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD)
పి. వెంకట్రామన్ పాఠశాల విద్యాశాఖ
ఎన్. ఆనంద్ (బుస్సీ ఆనంద్) మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్
ఆర్. నిర్మల్ కుమార్ విద్యుత్ శాఖ
రాజమోహన్ ఆదిద్రవిడ సంక్షేమ శాఖ
కె.జి. అరుణ్ రాజ కమర్షియల్ ట్యాక్సెస్ & రిజిస్ట్రేషన్ శాఖ
ఎస్. కీర్తనశాఖ కేటాయించాల్సి ఉంది
టి.కె. ప్రభుశాఖ కేటాయించాల్సి ఉంది
మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా ప్రతినిధి ఎస్. కీర్తనతో పాటు టి.కె. ప్రభులకు త్వరలోనే శాఖలను కేటాయించనున్నారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ఒంటరిగా 108 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 మంది మ్యాజిక్ ఫిగర్‌కు బలం సరిపోకపోవడంతో కాంగ్రెస్ (5 స్థానాలు), వీసీకే (2 స్థానాలు), వామపక్షాలు (సీపీఐ-2, సీపీఐ(ఎం)-2),ఐయూఎంఎల్ (2 స్థానాలు) కలిసి విజయ్‌కు బేషరతు మద్దతు ప్రకటించాయి.మిత్రపక్షాల బలంతో కలిపి 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్‌కు సమర్పించి విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ సాధించారు. సరికొత్త ఆశలతో, ఆశయాలతో తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్.. రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రజారంజక పాలన అందిస్తారనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
Follow Us