/rtv/media/media_files/2025/03/26/UuSyeiq434EJxPzOVwQa.jpg)
AshwiniVaishnaw Photograph: (AshwiniVaishnaw)
Betting Apps: తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియా సంచలనం రేపుతుంది. సోషల్ మీడియా ఇన్ఫూయెన్సర్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద సినీ నటుల వరకు అందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో ఇరుక్కుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం లోక్ సభలో ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్, గ్యాబ్లింగ్‌కు సంబంధించిన చట్టాలపై చర్చ జరిగింది. ఆయా అంశాలపై చట్టాలు చేసే బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్ర మంత్రి లోక్‌సభలో స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 1,410 ఆన్‌లైన్ గేమింగ్ సైట్‌లపై చర్యలు తీసుకున్నామని, వాటిని నిషేధించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు తీసుకుంటోందని, అయితే చట్టపరంగా తమ ప్రాంతాల్లో వాటిని నియంత్రించడం రాష్ట్రాల బాధ్యత అని పేర్కొన్నారు.
Also read: New income Tax: ఫోన్ డేటాతో బయటకు రానున్న బ్లాక్ మనీ.. పన్ను ఎగవేతదారులు బిగ్ షాక్!
Union Minister @AshwiniVaishnaw addressed concerns raised in Parliament regarding regulation and transparency in online gaming during the #BudgetSession2025.
— Ministry of Information and Broadcasting (@MIB_India) March 26, 2025
Replying to the questions asked by member during #QuestionHour in #LokSabha, the Minister highlighted the government's… pic.twitter.com/97fE3W4WBJ
Also Read: Mangalavaaram: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!
డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం చెప్పారు. రాజ్యాంగం ప్రకారం.. ఇది రాష్ట్రాలకు సంబంధించిన అంశమని ఆయన తెలిపారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఆన్‌లైన్ గేమింగ్ సైట్‌లను నిషేధించడానికి ఎందుకు నిర్దిష్ట చర్యలు తీసుకోవడం లేదని లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించిందని, ఈ విషయంలో కేంద్రం సైతం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దీనికి ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరిస్తూ.. రాజ్యాంగం ప్రకారం బెట్టింగ్, గ్యాంబ్లింగ్ రాష్ట్రాల జాబితా కిందకు వస్తాయని, వాటిపై చట్టాలు చేసే హక్కు కూడా రాష్ట్రాలకు ఉందన్నారు. ‘ఇండియన్ జస్టిస్ కోడ్’ సెక్షన్ 112 కింద ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్‌పై చర్యలు తీసుకోవచ్చని మంత్రి వివరించారు.
Also Read: Komatireddy Rajagopal Reddy: మా రేవంత్ రెడ్డి చాలా మంచోడు...లేకుంటే....