/rtv/media/media_files/2026/04/08/union-cabinet-2026-04-08-19-24-07.jpg)
Union Cabinet
Central Cabinet : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం బుధవారం సమావేశమైంది. ఈ సమావేశంలో 5 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఖరీఫ్ సీజన్ కోసం నూట్రియెంట్ బేస్డ్ సబ్సిడీగా రూ.41,533.81 కోట్లు కేటాయిస్తూ క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ కేటాయింపులు వ్యవసాయం, ఇంధనం, రవాణా రంగాల్లో భారీ మార్పులకు నాంది పలకనున్నాయని మంత్రి వర్గం అభిప్రాయపడింది. ప్రధానంగా ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి మేలు చేకూర్చేలా కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఎరువుల లభ్యత పెంచడంతో పాటు సామాన్య రైతులకు తక్కువ ధరలకే పోషకాలు అందజేయడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. దీనివల్ల సాగు వ్యయం తగ్గి రైతులకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని మంత్రి వర్గం అభిప్రాయపడింది.
#CabinetDecisions | कैबिनेट ने खरीफ सीजन 2026 (01 अप्रैल 2026 से 30 सितंबर 2026 तक) के लिए फॉस्फेटिक और पोटाशिक (P&K) उर्वरकों पर न्यूट्रिएंट बेस्ड सब्सिडी (NBS) दरों को मंजूरी दे दी है।@MIB_India@fertmin_india@AgriGoI@AshwiniVaishnaw#CabinetDecisions#NBS#Fertilizers… pic.twitter.com/KBSgytNGG2
— डीडी न्यूज़ (@DDNewsHindi) April 8, 2026
కాగా, ఖరీఫ్ సీజన్ కోసం కేటాయించిన నూట్రియెంట్ బేస్డ్ సబ్సిడీ గత ఏడాది 2025 ఖరీఫ్ సీజన్‌లో కేటాయించిన బడ్జెటరీ కేటాయింపుల కంటే రూ.4,313 కోట్లు అధికం. 2025 ఖరీఫ్ బడ్జెట్ రూ.37,216.15 కోట్లు కేటాయించారు. ఇక జైపూర్ మెట్రో ఫేజ్-2కు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రూ.13,038 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు తెలిపింది. ప్రహ్లాద్‌పుర నుంచి తోడి-మోడ్ వరకూ 36 స్టేషన్లను కలుపుతూ 41 కిలోమీటర్ల పొడవైన నార్త్-సౌత్ కారిడార్‌గా దీన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. కేంద్రం, రాజస్థాన్ ప్రభుత్వం జాయింట్ వెంచర్‌గా రాజస్థాన్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ దీన్ని చేపట్టడానికి అంగీకరించాయి.
అలాగే రాజస్థాన్‌లో హెచ్‌పీసీఎల్ రిఫైనర్ ఏర్పాటు కోసం రూ.79,459 కోట్లను కేటాయిస్తూ కేంద్ర మంత్రి మండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని కమ్లే, క్రా దాది-కురుంగ్ కుమే జిల్లాల్లో రూ.26,069.50 కోట్లతో 1720 మెగావాట్ల ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కూడా ఈ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు 96 నెలల్లో పూర్తవుతుందని మంత్రి వర్గం అంచనా వేసింది. కాగా, అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజావ్ జిల్లాలో 1200 మెగావాట్ల కళాయి-2 హైడ్రో ప్రాజెక్టు నిర్మాణానికి రూ.14,105.83 కోట్లు కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
Follow Us