Union Cabinet: పాన్ కార్డ్ 2.0కి కేంద్ర కేబినెట్ ఆమోదం.. ఆదాయపు పన్ను శాఖకు చెందిన పాన్ 2.0 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పాన్‌కార్డు ఆధునీకరణకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డు 2.0తో డిజిటల్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. By Manogna alamuru 25 Nov 2024 | నవీకరించబడింది పై 26 Nov 2024 06:52 IST in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ప్రధాని మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేబినెట్ మీటింగ్‌లో పాన్ కార్డు 2.0 మీద పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. పాన్‌కార్డు ఆధునీకరణకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డు 2.0తో డిజిటల్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. క్యూ ఆర్ కోడ్‌తో కొత్త కార్డులను పంపిణీ చేస్తామని తెలిపారు. దీంతో పాటూ అటల్ ఇన్నోవేషన్ 2.0కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని కోసం 2,750 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో భాగంగా ప్రాంతీయ భాషల్లో ఆవిష్కరణలకు కేంద్రం ప్రోత్సాహం ఇవ్వనుంది. Also Read: అదానీకి మరో షాక్..పెట్టుబడులు పెట్టేందుకు నిరాకరించిన టోటల్ ఎనర్జీస్ Also Read: Russian Plane: విమానం ల్యాండ్ అవుతుండగా ఇంజిన్‌లో మంటలు.. చివరికీ వన్ నేషన్-వన్ సబ్స్క్రిప్షన్.. ఇక విద్యార్థుల కోసం వన్ నేషన్-వన్ సబ్స్క్రిప్షన్ పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సబ్స్క్రిప్షన్ పథకానికి రూ.6వేల కోట్లు కేటాయించారు. అలాగే అరుణాచల్‌ప్రదేశ్‌లో సౌరవిద్యుత్ కేంద్రానికి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వీటన్నిటితో పాటూ సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నేషనల్ మిషన్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్‌కు ఆమోదం తెలిపింది. Also Read: IPL 2025: 13 ఏళ్ల కుర్రాడికి రూ.1.10 కోట్లు.. ఐపీఎల్ లో సంచలనం! Also Read: IPL: ముగిసిన ఐపీఎల్ వేలం.. ఫ్రాంఛైజీలు ఎంత ఖర్చు పెట్టాయి అంటే.. #income-tax-department #pan #union-cabinet మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి