Union Budget 2025: ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ నేడు ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ లో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. డిజిటల్ లెర్నింగ్ వనరుల యాక్సెస్ కోసం భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద అన్ని ప్రభుత్వ పాఠశాలలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ అందించబడుతుందని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 50వేల పాఠశాలల్లో 'అటల్ టింకరింగ్ ల్యాబ్స్' ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇవి విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి, సైంటిఫిక్ టెంపర్మెంట్ ని పెంచుతాయని చెప్పారు.
Broadband connectivity to be provided to all government secondary schools; Centres of Excellence in AI for education to be set up with total outlay of Rs 500 cr : Finance Minister Nirmala Sitharaman #Budget2025 #FinanceMinister #IndianEconomy #BudgetSpeech #IndiaBudget2025 pic.twitter.com/v4deLcSLtE
— Prudent Media (@prudentgoa) February 1, 2025
Also Read: Viral Video: ఏంటి మమ్మీ.. ఎవడీడు..! స్టార్ హీరో నుండి బిచ్చగాడిలా..