దండకారణ్యంలో విషాదం.. ఇద్దరు జవాన్లు మృతి

దండకారణ్యంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో నక్సలైట్లు ఏర్పాటు చేసిన బాంబు దాడిలో ఇద్దరు ఇండియన్ టిబేటియన్ బార్డర్ పోలీస్ (ITBP) జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

New Update
naxalites

దండకారణ్యంలో మరో దారుణం చోటుచేసుకుంది. నక్సలైట్లు ఏర్పాటు చేసిన బాంబు దాడిలో ఇద్దరు ఇండియన్ టిబేటియన్ బార్డర్ పోలీస్ (ITBP) జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే శనివారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో ఐటీబీపీ జవాన్లు సెర్చ్ ఆపరేషన్ చేశారు. ఈ క్రమంలో అప్పటికే ఆ ప్రాంతంలో ఐఈడీ బాంబును ఏర్పాటు చేసిన నక్సలైట్లు దాన్ని పేల్చేశారు. ఈ విషాద ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు నారాయణ్‌పూర్ జిల్లా పోలీసులు తెలిపారు.  

Also Read: ఓఎల్‌ఎక్స్‌లో ప్రభుత్వ భూమి అమ్మకాలు.. తక్కువ ధరకే ఫ్లాట్లు!

ఇదిలాఉండగా.. శుక్రవారం ఉదయం కూడా దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దు సమీపంలో నెండూర్ అనే గ్రామంలో నక్సలైట్లు, భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 38 మంది నక్సలైట్లు మృతి చెందారు. చనిపోయిన నక్సలైట్లలో పోలీసులు వాంటెడ్ క్యాష్ రివార్డ్‌ లిస్టులో ఉన్నారు. వీళ్లందరికీ కలిపి మొత్తం రూ.2.62 కోట్ల క్యాష్ రివార్డు ఉంది. చనిపోయిన 38 నక్సలైట్లలో పోలీసులు 31 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే 29 మృతదేహాలను వారి బంధువులకు కూడా అప్పగించారు.

Also Read: కలకలం రేపుతున్న బాంబు బెదిరింపులు.. మరో 3 విమానాలకు..  

ఈ మధ్యకాలంలో చూసుకుంటే దండకారణ్యంలో మావోయిస్టులు (నక్సలైట్లు) పిట్టల్లా రాలిపోతున్నారు. వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యం దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 2026 మార్చి నాటికి భారత్‌లో నక్సలైట్లను పూర్తిగా నిర్మూలిస్తామని మోదీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. గత పదేళ్లుగా నక్సల్స్‌ను లేకుండా చేయాలని కేంద్రం ఎన్నో ఆపరేషన్లు చేపడుతూ వస్తోంది. ముఖ్యంగా మావోయిస్టుల కంచుకోట అయిన ఛత్తీస్‌గఢ్‌ను ప్రత్యేకంగా టార్గెట్ చేసింది. అలాగే మావోయిజం వైపు ప్రజల దృష్టి మళ్లకుండా, దానికి ఆకర్షితులు కాకుండా ఉండేందుకు.. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది.       

Also Read: లెబనాన్ డ్రోన్ దాడి.. బెంజమిన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

Also Read: స్పెషల్ చికెన్‌.. తింటే ఇక నో డౌట్ చావు ఖాయం!

Advertisment
Advertisment
తాజా కథనాలు